నైజాంలో థియేటర్ల సమస్య ముదురుతోంది. లైగర్ బకాయిల విషయంలో నైజాం ఎగ్జిబిటర్ల పంతానికి సరైన మద్దతు ఇండస్ట్రీ నుంచి రావడం లేదు. నిర్మాత స్రవంతి రవికిషోర్ మధ్యవర్తిత్వం మీద ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఛాంబర్ లో ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. కానీ ఏమీ ఫలితం అయితే లేదు. లైగర్ కు సంబంధించి కీలకమైన చార్మి, పూరి తమ సినిమా ప్రమోషన్లలో ముంబైలో బిజీగా వున్నారు. హీరో రామ్ బంధువు కావడంతో స్రవంతి రవికిషోర్ మాత్రం సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు. కానీ ఎగ్జిబిటర్లు తమ బకాయిల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. గతంలో తమకు సహాయం చేస్తా అని నిర్మాత చార్మి మాట ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఎగ్జిబిటర్ల సమస్య విషయంలో టాలీవుడ్ నుంచి సరైన మద్దతు లభించడం లేదని వారు భావిస్తున్నారు. అందుకే బ్రహ్మాస్త్రం ప్రయోగించే యోచన చేస్తున్నారు. నిజానికి ఇది సాధ్యం కాదు కానీ, అవసరం అయితే అంత వరకు వెళ్లాలని ఎగ్జిబిటర్ల సంఘం పట్టుదలగా వుంది.
లైగర్ బకాయిల విషయం ఎటూ తేలకపోవడం నైజాం ఎగ్జిబిటర్లకు చికాకు కలిగిస్తోంది. తమకు సంబంధం లేదు వరంగల్ శ్రీను తో చూసుకోవాలని లైగర్ నిర్మాత చార్మి అంటున్నారు. లైగర్ కు వరంగల్ శ్రీను అనుకున్న మొత్తం కట్టలేదని, తాము కూడా నష్టపోయామని అన్నది చార్మి వాదన. చార్మికి చెప్పిన తరువాత, చార్మి హామీ మేరకే వరంగల్ శ్రీనుకు అడ్వాన్స్ లు ఇచ్చాము కనుక, తమకు సాయం చేయాలన్నది ఎగ్జిబిటర్ల వాదన.
ఈ విషయమై ప్రముఖ ఎగ్జిబిటర్ అసియన్ సునీల్ ను ప్రశ్నించగా, ఎగ్జిబిటర్ల సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వుంటామన్నారు.
సమస్యను డీల్ చేస్తున్న స్రవంతి రవికిషోర్ ను ప్రశ్నించగా, ఈ సమస్య చాలా చిన్నది అని, పరిష్కారం అయిపోతుందని అన్నారు.
Call boy works 8341510897
Vc estanu 9380537747
థియేటర్లు బంద్… అంటే ప్రేక్షకులు పండగ చేసుకోవచ్చన్న మాట
Public movie hit aithena theatres ki veltunaru
జనం పట్టించుకోరు
జనం పట్టించుకోరు
మాకు థియేటర్లు అవసరమే లేదు
Ott vundaga theatres yendhuku museyandi
Nizam lo theatres bandh chesina kamaravathi lo theatres kattukoni release cheyandi
Theatres lo movies evaru chudam ledhu industry lo drugs mafia yekkuvaindhi
Theatres ki evaru raavadam ledhu Movie 1st day matram full tharuvatha motham empty