నైజాంలో ఆచార్యకు థియేటర్ల సమస్య

బయ్యర్ల మధ్య పోటీ కావచ్చు. సినిమాల మధ్య పోటీ కావచ్చు. మొత్తానికి ఆచార్య సినిమాకు థియేటర్ల సమస్య మొదలైంది. నైజాంలో ఈ వ్యవహారం కాస్త అగ్లీ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.  Advertisement సినిమాల సమస్య…

బయ్యర్ల మధ్య పోటీ కావచ్చు. సినిమాల మధ్య పోటీ కావచ్చు. మొత్తానికి ఆచార్య సినిమాకు థియేటర్ల సమస్య మొదలైంది. నైజాంలో ఈ వ్యవహారం కాస్త అగ్లీ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సినిమాల సమస్య ఏమిటంటే కెజిఎఫ్ 2 థియేటర్లలో వుంది. ఇంకా మంచి కలెక్షన్లు నమోదు చేస్తోంది. దాని డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. అందువల్ల దాన్ని థియేటర్లలోంచి తీయడానికి ఆయన అంగీకరించడం లేదు. 

పైగా ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. ఆయనకు దిల్ రాజుకు మధ్య అంతగా పొసగదు అని గతంలోనే బయటపడింది. ఇప్పుడు కెజిఎఫ్ 2 కలిసి వచ్చింది. థియేటర్లు ఖాళీగా వుంటే వేరే సంగతి. కెజిఎఫ్ 2 నడుస్తోంది కనుక కాదనేది లేదు.

ఈ మేరకు మల్లగుల్లాలు నడస్తున్నాయి. అయితే మెగాస్టార్ సినిమా, రామ్ చరణ్ వున్నారు. ఆయనతో దిల్ రాజు సినిమా నిర్మాణంలో వుంది. అందువల్ల అడ్డం పడడం కష్టం. కానీ వరంగల్ శ్రీనుతో వ్యాపార పరమైన పోటీ తప్పదు. 

ఇలాంటి నేపథ్యలో దిల్ రాజు- శిరీష్ చాణక్యం ఎలా వుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే కెజిఎఫ్ ఆడుతున్న థియేటర్లకు ఫోన్ చేసి, తీయడానికి వీలు లేదు, కంటిన్యూ చేయమంటూ ఆదేశాలు వెళ్లాయి.

ఇవన్నీ ఇలా వుంచితే భరత్ అనే నేను సినిమా విషయంలో నైజాంలో కొంత రికవరీ వుండిపోయంది. అది దిల్ రాజుకు రావాల్సి వుంది. నిర్మాత దానయ్య తనకు సంబంధం లేదు. కొరటాల ఖాతానే అని అప్పట్లోనే చెప్పేసారు. మరి ఇప్పుడు దిల్ రాజు ఆ విషయం కూడా సెటిల్ చేసుకునే ఆలోచనలో వున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.