Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్నికల వేళ మరో పొలిటికల్ సినిమా

ఎన్నికల వేళ మరో పొలిటికల్ సినిమా

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరో పొలిటికల్ సినిమా తెరపైకి రాబోతోంది. ఇప్పటికే యాత్ర-2, వ్యూహం, శపథం, వివేకం, రాజధాని ఫైల్స్ లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడు ప్రతినిధి-2 సినిమా రాబోతోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఈ మూవీతో నారా రోహిత్ రీఎంట్రీ ఇస్తున్నాడు. యాంకర్ కమ్ జర్నలిస్ట్ మూర్తి, దర్శకుడిగా మారి తీసిన సినిమా ఇది. తమ సినిమా ఏ పార్టీకి లేదా ఒక వర్గానికి అనుకూలంగా ఉండదని, ప్రస్తుత రాజకీయాలపై సంధించిన ప్రశ్నల బాణమని చెబుతున్నాడు మూర్తి. కానీ ఒకే పార్టీకి చెందిన నారా రోహిత్, మూర్తి కలిసి ఎలాంటి ఔట్ పుట్ అందించి ఉంటారనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

సరిగ్గా పదేళ్ల కిందట ఇదే తేదీకి ప్రతినిధి సినిమా రిలీజైంది. అందుకే సెంటిమెంట్ కొద్దీ ఈసారి కూడా అదే తేదీకి విడుదల చేస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. నిజానికి ఇది సీక్వెల్ కాదు, కేవలం టైటిల్ ను మాత్రమే వాడుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు కథ రాసుకున్న మూర్తి, తనే స్వయంగా డైరక్ట్ చేశానని చెబుతున్నాడు. 

సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. జిషు సేన్ గుప్తా, సచిన్ ఖడేకర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

ఈమధ్య కాలంలో వచ్చిన పొలిటికల్ సినిమాలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. ప్రతినిధి-2 పదేళ్ల కిందటి తన సక్సెస్ ను రిపీట్ చేస్తుందా.. లేక పైన చెప్పుకున్న సినిమాల్లో చేరిపోతుందా అనేది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?