Advertisement

Advertisement


Home > Movies - Movie News

కోన-బాబి కుటుంబ కథా చిత్రమ్

కోన-బాబి కుటుంబ కథా చిత్రమ్

ఉగాది సందర్భంగా సకుటుంబ కథా చిత్రం ఒకటి ప్రారంభమైంది. ఇదేదో సినిమా జానర్ అనుకోవద్దు. రెండు కుటుంబాలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

కోన వెంకట్, దర్శకుడు బాబి కలిసి సినిమా చేస్తున్నారు. శ్రీవిష్ణుతో సినిమా స్టార్ట్ చేశారు. ఈరోజు మూవీ లాంఛ్ అయింది. జానకి రామ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాబి ఈ సినిమాకు నిర్మాత. కోన వెంకట్ కూడా ఓ నిర్మాత. వీళ్లిద్దరి కుటుంబాలు కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది.

పవర్ సినిమా నుంచి బాబి దగ్గర అసోసియేట్ గా పనిచేస్తున్నాడు జానకి రామ్. అతడిపై నమ్మకంతో, బాబి నిర్మాతగా మారాడు. విజిల్ వర్తీ ఫిలిమ్స్ పేరుతో బ్యానర్ పెట్టి, తన భార్యను నిర్మాతను చేశాడు. తను సమర్పకుడిగా మారాడు. కోన వెంకట్ ను కూడా చేర్చుకున్నాడు. అలా ఈ సినిమా కార్యరూపం దాల్చింది.

ఈ మూవీకి 'బేబి' ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. భాను భోగవరపు, నందు సవిరిగణ రచయితలు. ఈ భానూనే, రవితేజతో సినిమా చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్టును కూడా ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

వీళ్లిద్దరితో శ్రీవిష్ణుకు మంచి అనుబంధం ఉంది. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలకు మించిన వినోదాన్ని ఈ కొత్త సినిమాతో అందిస్తామని చెబుతున్నారు బాబి, కోన. మొత్తానికి ఈ సినిమాతో చాలా కొత్త కాంబినేషన్లు పురుడుపోసుకున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?