హీరో వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ 2020లో ఈ కథతో నన్ను సంప్రదించారు. నాకు కథ చాలా నచ్చింది. నేను సోనీ పిక్చర్స్ తో అంతకుముందు ఓ సినిమా చేయాలి. కానీ అది కొన్ని కారణాల వలన టేకాఫ్ కాలేదు. ఈ కథ వారికి పంపించినపుడు వారికీ నచ్చింది. వాళ్ళు కూడా అన్నీ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీస్తున్నారు. నేషనల్ అప్పీల్ వున్న కంటెంట్ ఇది. చాలా గ్రాండ్ బడ్జెట్ తో పక్కాగా ప్లాన్ సినిమాని చేశారు. దర్శకుడు హిందీ అబ్బాయి అయినప్పటికీ సినిమాని తెలుగులో చేయాలనే ఉద్దేశం ఆయనలో వుంది. సోనీ పిక్చర్స్ వచ్చిన తర్వాత హిందీలో కూడా చేయాలని నిర్ణయించాం. ప్రతి సీన్ ని తెలుగు, హిందీ రెండు భాషల్లో షూట్ చేశాం.
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ లో చాలా పాషన్ వుంది. ఏదో ఒక సినిమా చేసేయాలనే ఆలోచన తనలో లేదు. ప్రత్యేకంగా ఈ కథనే నా ద్వారా చెప్పాలని అనుకున్నాడు. అంతకుముందు తను చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా వైరల్ అయ్యింది. ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై సినిమా చేయాలనుకున్నపుడు ఇంకా కావాల్సిన సమాచారం ఇస్తామని వారు చెప్పారు. ఈ కథని చాలా పాషన్ తో చేశాడు. తనకి వీఎఫ్ఎక్స్ పై కూడా చాలా మంచి పట్టు వుంది.
2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత వైమానిక దళం ఆపరేషన్ నిర్వహించింది. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది. వాలెంటైన్ డే రోజు జరిగింది కాబట్టి శత్రువులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గా ఈ ఎటాక్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమాలో వాలెంటైన్ అంటే ప్రతి ఒక్కరికీ దేశం మీద వున్న ప్రేమ. ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఈ సినిమా చూపించాం. పుల్వామా ఘటన పై ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో 'ఆపరేషన్ వాలెంటైన్' ది బెస్ట్ అని వారు ప్రసంశించారు.
ఒక ఫ్లయిట్ సిమ్యులేటర్ లో కూర్చోబెట్టి రియల్ లైఫ్ ప్రోజక్షన్ అనుభూతిని ఇచ్చేలా చేశారు. అందులో కూర్చుంటే రియల్ గా ప్లయిట్ నడిపినట్లే వుంటుంది. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ఇలాంటి పాత్రలు చేయడం ఒక ఛాలెంజ్. ముఖం మొత్తం ఆక్సిజన్ మాస్క్ తో కప్పబడి వుంటుంది. ఎమోషన్ ని కళ్ళతోనే పలికించాలి. ఇందులో రుద్ర పాత్రలో కనిపిస్తాను. రుద్ర పాత్రతో అందరూ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.
హిందీ కోసం రెండు నెలలు క్లాసులు తీసుకున్నాను. డిక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఎమోషనల్ డైలాగులు చెప్పడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక సీన్ ని మొదట హిందీలో షూట్ చేసి తర్వాత తెలుగులో షూట్ చేసిన్నపుడు మధ్యమధ్యలో హిందీ డైలాగులు కూడా వచ్చేసేవి( నవ్వుతూ) చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసేవాళ్ళం.
టీజర్ రిలీజ్ అయిన తర్వాత కళ్యాణ్ బాబాయ్ ని కలవడం జరిగింది. ఆయన సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. బావుంది, గుడ్.. ఇంతవరకే వుంటుంది ఆయన రియాక్షన్. ఆలాంటి ఆయన 'ఆపరేషన్ వాలెంటైన్' టీజర్ ని ఐదారుసార్లు చూశాను. చాలా బావుంది. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా చాలా బాగా కనిపిస్తున్నావ్. సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను’ అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇలా చెప్పడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు బాబాయ్ కి చాలా ఇష్టం.
ఈ సినిమా తరువాత మట్కా లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది మంచి కమర్షియల్ రివెంజ్ డ్రామా.