త్రివిక్రమ్ కు అవార్డు ఇవ్వాల్సిందే

హీరోలు గొప్పవాళ్లే కావచ్చు. కానీ వాళ్లను చెక్కి, శిల్పాలుగా మలచిన వాళ్లు దర్శకులు. గొప్ప పాత్రలు తయారు చేసి, హీరోల చేత నటింప చేసి, అద్భుతమైన సినిమాలు అందించేవాళ్లు దర్శకులు.

హీరోలు గొప్పవాళ్లే కావచ్చు. కానీ వాళ్లను చెక్కి, శిల్పాలుగా మలచిన వాళ్లు దర్శకులు. గొప్ప పాత్రలు తయారు చేసి, హీరోల చేత నటింప చేసి, అద్భుతమైన సినిమాలు అందించేవాళ్లు దర్శకులు. మరి దర్శకులకు ఎందుకు పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు ఎక్కువగా రావు? ప్రతి సీనియర్ హీరోకు దాదాపుగా ఏదో ఒక అవార్డు వస్తుండగా, కె. విశ్వనాథ్, బాపు లాంటి దర్శకులకు మాత్రమే పద్మ అవార్డులు లభించాయి. కానీ ఈ జనరేషన్‌లో రాజమౌళి మినహా ఇంకెవరికి రాలేదు.

సుకుమార్, త్రివిక్రమ్, హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లాంటి మంచి దర్శకులు మనకు ఈ తరం అందించారు. వీరికి కూడా అవార్డులు రావాలి కదా? త్రివిక్రమ్ మంచి రచయిత. బాగా చదువుకున్నవాడు. కుటుంబ కథా చిత్రాలకు కొత్త జీవం పోశారు. ఆయన పేరును పద్మ అవార్డు కోసం సిఫార్సు చేయమని పవన్ కళ్యాణ్ అయినా చెప్పి ఉండాల్సింది.

అలాగే, సుకుమార్ జాతీయ స్థాయి సినిమాలు తీశారు. హను రాఘవపూడి సీతారామం వంటి భావోద్వేగభరితమైన సినిమాలు తీశారు. నాగ్ అశ్విన్ తీసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ఇలాంటి దర్శకుల పేర్లు కూడా పద్మ అవార్డులకు సిఫార్సు చేస్తే బాగుండేది. ఇప్పటికైనా ఆలస్యమైంది కాదు. మరోసారి అవకాశం వచ్చినప్పుడు దర్శకుల పేర్లను గుర్తుంచుకోవాలి. తెర ముందు కనిపించే నటుల కన్నా, తెర వెనుక శ్రమించే క్రియేటర్స్‌కు విలువ ఎక్కువగా ఇవ్వాలని గమనించాలి.

10 Replies to “త్రివిక్రమ్ కు అవార్డు ఇవ్వాల్సిందే”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. సడన్ గా బాలయ్య మీద త్రివిక్రమ్ మీద ప్రేమ కురిపిస్తున్నారు ఏమిటో ???

Comments are closed.