ఏఆర్ రెహ్మాన్ మళ్లీ దూరమయ్యాడా?

సినిమా ప్రారంభానికి ముందే రెహ్మాన్ 3 పాటలు కూడా ఇచ్చేశాడు.ఇలాంటి టైమ్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకున్నాడనే పుకార్లు ఊపందుకున్నాయి.

తెలుగులో సినిమా చేస్తాడనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణంతో దూరమౌతున్నాడు రెహ్మాన్. గతంలో సైరా సినిమా కోసం రెహ్మాన్ ను తీసుకున్నారు. అతడ్ని తప్పించారో లేక తప్పుకున్నాడో తెలియదు కానీ సైరాకు రెహ్మాన్ కు సంబంధం లేకుండా పోయింది.

ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో కూడా ఇలాంటి అనుమానాలే మొదలయ్యాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమా కోసం ఏఆర్ రెహ్మాన్ ను తీసుకున్నారు. సినిమా ప్రారంభానికి ముందే రెహ్మాన్ 3 పాటలు కూడా ఇచ్చేశాడు.

ఇలాంటి టైమ్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకున్నాడనే పుకార్లు ఊపందుకున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్టులో రెహ్మాన్ ఉన్నాడని, ప్రస్తుతం యాక్టివ్ గా పనిచేస్తున్నాడని కూడా యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో “రెహ్మాన్ ఎగ్జిట్”పై పుకార్లకు చెక్ పడింది. అదేంటో ప్రతిసారి రెహ్మాన్ పైనే ఇలాంటి గాసిప్స్ వినిపిస్తుంటాయి.

ఈ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు పూర్తిగా బుచ్చిబాబు సినిమాపైనే దృష్టిపెట్టాడు రామ్ చరణ్. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. రేపట్నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ఉంటుంది.

6 Replies to “ఏఆర్ రెహ్మాన్ మళ్లీ దూరమయ్యాడా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.