ప‌ద్మ పుర‌స్కారాల‌కు వీళ్లెందుకు అర్హులు కాలేదు?

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించింది. ఈ విష‌యంలో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వాపోయారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ పుర‌స్కారాల్ని ప్ర‌క‌టించింది. ఈ విష‌యంలో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వాపోయారు. ఒక‌వైపు ప‌ద్మ విభూష‌ణ్ వ‌రించిన డాక్ట‌ర్ డి. నాగేశ్వ‌ర‌రెడ్డి, అలాగే ప‌ద్మ భూష‌ణ్ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌ను అభినందిస్తూనే, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ల‌బ్ధి ప్ర‌తిష్టుల‌ను విస్మ‌రించ‌డాన్ని రేవంత్‌రెడ్డి త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ కేంద్ర స‌ర్కార్‌కు లేఖ రాస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్‌కు ప‌ద్మ విభూష‌ణ్‌, అలాగే చుక్కా రామ‌య్య‌, అందెశ్రీ‌ల‌కు ప‌ద్మ భూష‌ణ్‌, గోర‌టి వెంక‌న్న‌, జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావుల‌కు ప‌ద్మశ్రీ పుర‌స్కారాలు ఇవ్వాల‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ప్ర‌తిపాద‌న‌లు పంపింది. కానీ వీళ్ల‌లో ఏ ఒక్క‌రినీ కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు.

డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డికి ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు ఇవ్వ‌డంపై ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. ఇదే సంద‌ర్భంలో తెలంగాణ స‌ర్కార్ పంపిన జాబితాలోని పేర్ల‌ను ప‌రిశీలిస్తే అన్ని రకాలుగా అర్హులే. తెలంగాణ‌లో కాంగ్రెస్ పాల‌న సాగిస్తుండ‌డంతో ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌నే అభిప్రాయం క‌లుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఒక‌రిద్ద‌రి పేర్ల‌ను గ‌మ‌నిస్తే, ప‌క్కా రాజ‌కీయ ఎజెండాతోనే పుర‌స్కారాల్ని ఇచ్చార‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

గ‌ద్ద‌ర్ ప్ర‌జా గాయ‌కుడిగా తెలుగు స‌మాజంలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనారోగ్యంతో ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అలాగే రేవంత్‌రెడ్డి స‌ర్కార్ పంపిన పేర్ల‌లో గోర‌టి వెంక‌న్న వుండ‌డం విశేషం. ఈయ‌న బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసి, ఆల‌పించిన ఖ్యాతి అందెశ్రీ‌ది. చుక్కా రామ‌య్య ఎంత గొప్ప విద్యావేత్తో అంద‌రికీ తెలుసు. అలాగే జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు ఆర్టిస్ట్‌గా, సాహితీకారుడిగా ప్ర‌సిద్ధుడు. మ‌రెందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్న‌ది ప్ర‌శ్నే. నిల‌దీయాల్సిన అంశ‌మే. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది.

16 Replies to “ప‌ద్మ పుర‌స్కారాల‌కు వీళ్లెందుకు అర్హులు కాలేదు?”

  1. మిగిలిన వాళ్ళ సంగతి సరే కానీ…గద్దర్ పద్మవిభూషణ్ కి అర్హుడేనా????!!!

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

    1. వాళ్లకి ఇవన్నీ లొట్టపీసు అవార్డులు , ఏవైనా డబ్బు వచ్చేవి కార్ రేస్ లాంటివి మినిమం ఉండాలి కేటీఆర్ గాడికి అనాలి అంటే

  3. There are so many doctors engineers professors farmers CAs and other important professionals who are doing great work. They dont recognize any of them, but give importance to actors and TV personalities. That is the state of India.

  4. If Revanth is nominating Gaddar for an award . It’s shame for democracy and constitution.

    Gaddar fought against democracy and constitution. That guy was anti government all all the time .

Comments are closed.