విజ‌యసాయి రాజీనామా.. టీడీపీలో ఉలికిపాటు!

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి, వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో టీడీపీ మొద‌ట సంబ‌ర‌ప‌డింది. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు కానీ, ఆ పార్టీలో ఒక ర‌క‌మైన ఉలికిపాటు క‌నిపిస్తోంది.

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి, వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో టీడీపీ మొద‌ట సంబ‌ర‌ప‌డింది. ఆ త‌ర్వాత ఏమైందో తెలియ‌దు కానీ, ఆ పార్టీలో ఒక ర‌క‌మైన ఉలికిపాటు క‌నిపిస్తోంది. బీజేపీ త‌మ‌తో మైండ్ గేమ్ ఆడుతోందా? అనే అనుమానం టీడీపీలో క్ర‌మంగా పెరుగుతోంది. ఇదంతా వైఎస్ జ‌గ‌న్ గేమ్ ప్లాన్‌గా టీడీపీ చూస్తోంది. త‌మ వెనుకాల ఏదో కుట్ర జ‌రుగుతోంద‌ని టీడీపీ అనుమానిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ బ‌ల‌ప‌డే క్ర‌మంలో వైసీపీ నేత‌ల్ని చేర్చుకుంటోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీలో జ‌గ‌న్ త‌ర్వాత ఎవ‌ర‌ని ప్ర‌శ్నిస్తే, విజ‌య‌సాయిరెడ్డి పేరు స‌మాధానంగా వ‌స్తుంది. అలాంటి నాయ‌కుడు అక‌స్మాత్తుగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకోడాన్ని ఎలా చూడాలో టీడీపీకి దిక్కుతోచ‌ని ప‌రిస్థితి. ఏపీలో బీజేపీ రాజ‌కీయంగా బ‌ల‌ప‌డితే, న‌ష్ట‌పోయేది టీడీపీనే. ఇప్ప‌టికే జ‌న‌సేనాని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని ప‌సందైన రాజ‌కీయ ఆట‌కు బీజేపీ శ్రీ‌కారం చుట్టింద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హార శైలిపై చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు. కూట‌మి ప్ర‌భుత్వంలో వుంటూ, మీరు , మేము వేర్వేరు అన్న‌ట్టుగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా తిరుప‌తి తొక్కిస‌లాట‌కు సంబంధించి ప్ర‌భుత్వానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్ తీవ్ర న‌ష్టం క‌లిగించాయ‌ని టీడీపీ ఆగ్ర‌హంగా వుంది. అందుకే క్ష‌మాప‌ణ చెప్పాల‌నే ప‌వ‌న్‌క‌ల్యాణ్ డిమాండ్‌ను ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయంగా మంత్రి నారా లోకేశ్ కొట్టి పారేశారు.

క్ష‌మాప‌ణ చెప్పాల‌నేది టీడీపీ స్టాండ్ కాద‌ని మంత్రి లోకేశ్ తేల్చి చెప్పారు. కానీ ప‌వ‌న్ మాత్రం క్ష‌మాప‌ణ చెప్ప‌డం త‌ప్ప‌, మ‌రో మార్గం లేద‌ని గ‌ట్టిగా డిమాండ్ చేశారు. హిందుత్వ ఎజెండాతో ప‌వ‌న్‌ను ముందు పెట్టి బీజేపీ ఆడిస్తోంద‌ని టీడీపీ సందేహిస్తోంది. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్య‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఈ సీటును బీజేపీ తీసుకుంటుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఇప్ప‌టికే ఒక సీటును బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణ‌య్య‌కు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇలా రాజ్య‌స‌భ సీట్ల‌న్నీ బీజేపీకి ఇస్తూ పోతే, ఇక టీడీపీ బ‌ల‌హీనం కాకుండా ఏమ‌వుతుంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అందుకే విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా అంశం టీడీపీలో కొత్త అనుమానాల‌కు తెర‌లేపింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

33 Replies to “విజ‌యసాయి రాజీనామా.. టీడీపీలో ఉలికిపాటు!”

  1. ఆహా.. ఏంట్రా ఇంత లేటయ్యింది.. ఇంకా ఆర్టికల్ రాలేదేంటి అని ఎదురు చూస్తున్నా..

    అదిగో.. వచ్చేసింది..

    విజయ సాయి రెడ్డి రాజీనామా టీడీపీ కే నష్టం.. వైసీపీ కి ఫుల్లుగా లాభం..

    మరి అంత లాభం ఉన్నవాళ్లు ఇన్నాళ్లు ఎందుకు రాజీనామా చేయకుండా ఉన్నారో మరి..

    ..

    నిన్న పొద్దున్న…

    ఈ సీటు ని నాగబాబు కి ఇచ్చాడు

    సాయంత్రానికి..

    అదే సీటు ని చిరంజీవి కి ఇచ్చాడు..

    ఈ రోజు పొద్దున్న..

    సీటు ఒకటే.. కానీ ఈ సారి బీజేపీ కి ఇచ్చేసాడు ..

    ..

    రేపు ఆ సీటు టీడీపీ తీసుకుంటే..

    టీడీపీ ని అసహ్యించుకుంటున్న ప్రజలు.. అంటూ ఇంకో రోత రాత వదులుతాడు..

  2. ఆహా.. ఎంట్రా ఇంత లేటయ్యింది.. ఇంకా ఆర్టికల్ రాలేదేంటి అని ఎదురు చూస్తున్నా..

    అదిగో.. వచ్చేసింది..

    విజయ సాయి రెడ్డి రాజీనామా టీడీపీ కే నష్టం.. వైసీపీ కి ఫుల్లుగా లాభం..

    మరి అంత లాభం ఉన్నవాళ్లు ఇన్నాళ్లు ఎందుకు రాజీనామా చేయకుండా ఉన్నారో మరి..

    ..

    నిన్న పొద్దున్న…

    ఈ సీటు ని నాగబాబు కి ఇచ్చాడు

    సాయంత్రానికి..

    అదే సీటు ని చిరంజీవి కి ఇచ్చాడు..

    ఈ రోజు పొద్దున్న..

    సీటు ఒకటే.. కానీ ఈ సారి బీజేపీ కి ఇచ్చేసాడు..

    ..

    రేపు ఆ సీటు టీడీపీ తీసుకుంటే..

    టీడీపీ ని అసహ్యించుకుంటున్న ప్రజలు.. అంటూ ఇంకో రోత రాత వదులుతాడు..

  3. కొంచెం లేట్ ఐన కానీ న్యూట్రల్ మీడియా అసలు నిజాల్ని బయటకి పెట్టేసింది…..ఇది అంతా అన్న వ్యూహం…అన్న లండన్ లో ఉన్నప్పుడే ఇలా అడ్డుకుంటే..ఇంకా ఆంధ్ర వచ్చేసరికి ఎలా ఉంటుందో అని టీడీపీ షాక్ అవుతుంది…టాపిక్ ఏదయినా అన్న రాక్స్ టీడీపీ shocks …ఇదే న్యూట్రల్ జెర్నలిజం అంటే ….

  4. వీడు ప్రపంచం లొ ఎమి జరిగినా…. అది TDP కి నష్టం Y.-.C.-.P కి లాబం అనట్టు రాసాడు! వీడి కామిడీ రాతలు చూసి జనం నన్వుకుంటున్నారు అన్న శ్రుహ ఈ GAS గాడికి లెదు!!

  5. రెపు జగన్ కూడా Y.-.C.-.P కి రాజెనామా చెస్తె…. TDP అసలు కుంగిపొతుందెమొ జర చూస్కొ రా GA అయ్యా???

  6. జగన్ వ్యూహం అయినా,గతంలోలా జగన్ని నమ్మే స్థితిలో రెడ్లు,వై యస్ అభిమానులు లేరు.2024 లో వాళ్ళు 10% దూరం అయ్యారు.మహా అయితే 5% గతిలేక దగ్గరవుతారు.

    కార్యకర్తలకు జగన్ మిగిల్చిన క్షోబ ఇప్పట్లో తగ్గదు.

    ఇండియాలో ఏ పార్టీ కూడా ఇంతలా కార్యకర్తలను వాడుకుని వదిలేసిన పార్టీ లేదు.జగన్ రాజకీయాలు ఎప్పుడూ కులం చుట్టూనే తిరుగుతాయి.

    పవన్,బాబు కలిసి ఉన్నంతవరకు జగన్ చచ్చు పుచ్చు రాజకీయాలు చెల్లకపోవచ్చు.

    1. పవన్, బాబు విడిపోయిన ట్రైయాలింగ్ ఫైట్ లో కూడా జగన్ గెలిచేది ఉండదు (ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోతుంది కాబట్టి).. టిడిపి ఒంటరిగా పోటీ చేసిన కూడా 40% ఓట్లు తగ్గవు

  7. అరేయ్ గ్రేట్ గూట్లే ప్రపంచం లో ఏం జరిగినా అది TDPకి నష్టం YCPకి లాభం అని మొదలెడ్తావ్…ఇప్పటికే వాన్ని ఇలాంటి రాతలతో వెర్రి వెంగలప్ప ని చేసావ్…ఇంకేం మిగిలింది ఇంక చెయ్యడానికి…పాపం వాన్ని అలా వదిలెయ్యరా…వాడు అసలే మెదడు పెరగని నెల తక్కువ ఎదవ

  8. అరేయ్ గ్రేట్ గూట్లే! ప్రపంచం లో ఏం జరిగినా అది TDPకి నష్టం YCPకి లాభం అని మొదలెడ్తావ్…ఇప్పటికే వాన్ని ఇలాంటి రాతలతో వెర్రి !వెంగలప్పని చేసావ్…ఇంకేం మిగిలింది ఇంక చెయ్యడానికి…పాపం వాన్ని అలా వదిలెయ్యరా…వాడు అసలే మెదడు పెరగని నెల తక్కువ !ఎదవ

  9. అరేయ్ గ్రేట్ !గూట్లే! ప్రపంచం లో ఏం జరిగినా అది TDPకి నష్టం YCPకి లాభం అని మొదలెడ్తావ్…ఇప్పటికే వాన్ని ఇలాంటి రాతలతో వెర్రి !వెంగలప్పని చేసావ్…ఇంకేం మిగిలింది ఇంక చెయ్యడానికి…పాపం వాన్ని అలా వదిలెయ్యరా…వాడు అసలే మెదడు పెరగని నెల తక్కువ !ఎదవ

  10. *అరేయ్ గ్రేట్ *గూట్లే…ప్రపంచం లో ఏం జరిగినా అది TDPకి నష్టం YCPకి లాభం అని మొదలెడ్తావ్…ఇప్పటికే వాన్ని ఇలాంటి రాతలతో ^వెర్రి !వెంగలప్పని చేసావ్…ఇంకేం మిగిలింది ఇంక చెయ్యడానికి…పాపం ‘వాన్ని అలా ‘వదిలెయ్యరా…వాడు అసలే మెదడు పెరగని నెల తక్కువ !ఎదవ

  11. Y.-.C.-.P కి 11 వచ్చినందుకు TDP కి నిద్రలెని రాత్రులు…. జగన్ సంబరాలు అని కూడా రాయి!

  12. 2019-24 లో మన అన్న పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా బీజేపీ బలపడితే నష్టపోయేది టీడీపీనే ..ఇప్పుడు 2024 లో టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు కూడా బీజేపీ బలపడితే నష్టపోయేది టీడీపీనే…ఏంటో న్యూట్రల్ మీడియా తీరే అంత …ఇంత లోతయిన ఎనాలిసిస్ చేసినందుకు మీకు ఏదయినా అవార్డు ఇవ్వాలి…కానీ ఎం చేద్దాం మీరు న్యూట్రల్ మీడియా ఐపోతిరి…ఇలాంటి రాగద్వేషాలుకి …అవార్డులు ..రివార్డులు కి అతీతం అయిపోయారు…..

  13. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  14. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  15. Bjp అయినా టీడీపీ అయినా జనసేనా అయినా చివరికి ప్రజా శాంతి పార్టీ అయినా పర్లేదు కానీ దిక్కుమాలిన వైసిపి మాత్రం వద్దు మాకు

  16. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అన్నయ్య రాజకీయం ఎవరికి అర్థం కాలేదు బటన్ నొక్కి నవరత్నాలు ఇవ్వడం వల్ల ప్రజలంతా అన్నయ్య వెనుకే ఉన్నారు కుప్పం లో ఓడిపోవడం ఖాయం అని గోల చేశారు..

    ఇప్పుడు పార్టీ నుంచి ఎవరైనా రాజీనామా చేస్తే అది టిడిపి కే నష్టం అని గోల చేస్తున్నారు..

  17. ఇప్పటికి 10 సార్లు కి పైగా దావోస్ వెళ్ళారు… కోట్లు కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చా అని చెప్పి డబ్బా లు కొట్టి, ఇప్పుడు ఏకంగా ప్లాప్ షో.. ఆఖరికి, ఫేక్ MOU (బాబు, అండ్ హిస్ మీడియా చెప్పారు మిగతా రాష్ట్రాలు ఫేక్ వి చేసుకొన్నాయి అట ) కుడా చెయ్యలేని పరిస్థితి .. ఒక్క కంపెనీ కూడా ఒప్పుకోలేదంటే.. ఎంత దౌర్భాగ్యం.. రెడ్బూక్ రాజ్యాంగం.. ఇంకో విషయం, ఆఖరికి ఆ దావోస్ లో కూడా రెడ్బూక్ కోసం అడిగారు.. అక్కడికి వచ్చిన వాళ్ళు…

  18. వీసా రెడ్డే కాదు, జగన్ ని లాగేసుకున్నా, బీజేపీ ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో గెలవడం కష్టం. రాష్ట్ర విభజన కుట్ర తెలుగు ప్రజలు అంత త్వరగా మర్చి పోతారానుకోను.

    బాబు గారు “ఎక్కడ తగ్గాలో ” తెలుసుకుని మసులుకుంటే, రాష్ట్ర అభివృద్ధి కి కేంద్రం సహకారం ఉంటుంది. అభివృద్ధి జరిగితే వైసీపీ, బీజేపీ వైపు ప్రజలు కన్నెత్తి కూడా చూడరు. అలాకాకుండా బాబు గారు మళ్ళీ 2014 అవతారం ఎత్తితే, వైసీపీ కి ఓట్లు పడి మనం మట్టి కరిచిపోవడం ఖాయం

Comments are closed.