జ‌గ‌న్ ప్రేమాభిమానులు.. అతివృష్టి, అనావృష్టి!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రేమాభిమానాలు అతివృష్టి, అనావృష్టి అనే అభిప్రాయం వైసీపీ నేత‌ల్లో వుంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రేమాభిమానాలు అతివృష్టి, అనావృష్టి అనే అభిప్రాయం వైసీపీ నేత‌ల్లో వుంది. న‌మ్మితే నెత్తికెత్తుకుని ఊరేగుతారు. లేదంటే ఎంత‌టి వారినైనా కింద‌ప‌డేస్తారు. జ‌గ‌న్ దగ్గ‌ర ఎప్పుడు ఎవ‌రి ప‌రిస్థితి ఎలా వుంటుందో చెప్ప‌లేమ‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటుంటారు. అంద‌రినీ అభిమానిస్తున్న‌ట్టే ఉంటారు. ఎవ‌రైనా, ఏదైనా చెబితే వెంట‌నే న‌మ్మ‌డం, ఒక అభిప్రాయానికి రావ‌డం ఆయ‌న బ‌ల‌హీన‌త‌గా చెబుతారు.

అందుకే వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, మాగుంట శ్రీ‌నివాస్‌రెడ్డి, లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు లాంటి నాయ‌కుల్ని చేజేతులా పోగొట్టుకున్నార‌నే చ‌ర్చ వైసీపీలో వుంది. రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని తెలిసి కూడా ఆయ‌న ఖాత‌రు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే 2024 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాల‌య్యామ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

రాజ‌కీయాల‌తో ఏ మాత్రం సంబంధం లేని విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని చాలా కాలంగా ఆయ‌న మోస్తున్నారు. ఇద్ద‌రికీ విప‌రీత ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుక‌నో విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో క్ర‌మంగా ప్రాధాన్యం త‌గ్గిస్తూ వ‌చ్చారు. అంత వ‌ర‌కూ నెత్తిన మోసిన నాయ‌కుడు, కిందికి దింపి న‌డ‌వ‌మంటే ఎవ‌రికైనా మంటే. విజ‌య‌సాయిరెడ్డిలో అసంతృప్తి వుందంటే, వుండ‌దా మ‌రి! స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విష‌యంలోనూ అంతే. తండ్రీతో పాటు త‌న‌యుడు భార్గ‌వ్‌కు కూడా విప‌రీత ప్రాధాన్యం.

అలాగే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబానికి బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కొంత కాలంగా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిని భుజాన మోస్తున్నారు. చెవిరెడ్డి చెప్పిందే వేద‌వాక్కు. ఒక రాజ‌కీయ పార్టీని న‌డుపుతున్న‌ప్పుడు, ఇలా కొంత మంది చేతుల్లో పార్టీ వుంద‌నే సంకేతాలు ప్ర‌మాదక‌ర ధోర‌ణి. రాజ‌కీయ పార్టీ అంటే, అందులో వుండే నాయ‌కులంతా త‌మ‌ది అనే ఫీలింగ్‌కు గుర‌య్యేలా నాయ‌కుడు న‌డుచుకోవాలి.

కానీ జ‌గ‌న్ ఇంత వ‌ర‌కూ అలా న‌డుచుకున్న దాఖ‌లాలు లేవు. జ‌గ‌న్ కేవ‌లం కొంద‌రి వాడే అని నాయ‌కులు అనుకునే ప‌రిస్థితి. దీంతో ప్ర‌త్య‌ర్థుల‌కు సులువుగా ఆయ‌న టార్గెట్ అవుతున్నారు. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లొస్తే, మ‌న‌కెందుకులే అని ఇత‌ర నాయ‌కులు మౌనంగా వుంటున్నారు. జ‌గ‌న్ న‌మ్ముకున్న నాయ‌కులు అస‌లే మాట్లాడ‌రు. జ‌గ‌న్‌కు న‌చ్చిన నాయ‌కులు ఏం చేసినా, ఆయ‌న ఏమీ అన‌రు.

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా, రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా న‌ష్ట‌పోతే… అప్పుడు జ‌గ‌న్ అయ్యో అని బాధ‌ప‌డుతుంటారు. వైసీపీ అంటే కొంత మంది నాయ‌కులు మాత్రమే క‌నిపిస్తుండ‌డంతో, వాళ్లు రాజ‌కీయంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా, అంతిమంగా దాని ప్ర‌భావం జ‌గ‌న్‌పై ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌సాయిరెడ్డే. ఆయ‌న రాజీనామాతో వైసీపీ ప‌ని అయిపోయింద‌నే విమ‌ర్శ‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టైంది.

ఇదే ప‌ది మంది నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇస్తే, ఇలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాదు. ఆ దిశ‌గా ఆలోచించాల్సింది జ‌గ‌నే. అదేంటో గానీ, ఆయ‌న కొంత మందినే చుట్టూ పెట్టుకున్నారు. దీంతో జ‌గ‌న్ ద‌గ్గ‌రికి చేరాలంటే, ప‌ద్మ వ్యూహాన్ని ఛేదించాల‌న్నంత ప‌ని చేయాల‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తీరులో మార్పు రావాలి. అప్పుడే వైసీపీకి మంచి రోజులు.

28 Replies to “జ‌గ‌న్ ప్రేమాభిమానులు.. అతివృష్టి, అనావృష్టి!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. అన్నీ తనకు అనుకూలం గా ఉన్నప్పుడు రెచ్చిపోయే వ్యక్తిత్వం జగన్ రెడ్డి ది ..

    సోనియా పైన తిరగబడింది కూడా అందుకే.. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వైఎస్సార్ అవినీతి ని చూస్తూ ఊరుకొన్నారు.. ఆయన చనిపోయాక అవినీతి అనేసరికి ప్రజల్లో జగన్ రెడ్డి మీద సింపతీ వచ్చింది.. దాన్ని తనకి అనుకూలం గా వాడుకున్నాడు..

    ..

    పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడే తత్వం జగన్ రెడ్డి కి లేదు.. అతనొక మానిప్యులేట్ లీడర్..

    151 నుండి 11 కి పడిపోవడం అనేది అతని పతనం .. ఇక భవిష్యత్తు లో 11 నుండి కనీసం 90 అనేది అసాధ్యం..

    ఒకప్పుడు జగన్ రెడ్డి పోరాటయోధుడు.. ఇప్పుడు జనాలు ఆ భ్రమల్లో లేరు.. మళ్ళీ ఆ భ్రమ లోకి దింపడం జగన్ రెడ్డి వల్ల కాని పని..

    ఒకప్పుడు జగన్ రెడ్డి కోసం వెనక నిలబడి పోరాడిన లీడర్లు ఉన్నారు.. వాళ్లంతా చీకట్లో ఉండి.. జగన్ రెడ్డి ని సూర్యుడు గా చూపించారు.. ఇప్పుడు వాళ్ళందరూ వెలుగులోకి వచ్చేసరికి.. జగన్ రెడ్డి వెలుగు మసకబారిపోతోంది..

    ..

    ఎవరైనా ఒక్కసారే మోసపోతారు.. ఆంధ్ర ప్రజలు జగన్ రెడ్డి విషయం లో దారుణం గా మోసపోయారు..

    అందుకు గత ఎన్నికలే సాక్ష్యం.. కంచుకోటలే బద్దలైపోయాయి..

    జగన్ రెడ్డి అనే చీకటి శకం ముగిసింది.. అతని అబద్ధాలు, నాటకాలు, అరాచకాలు, అవినీతి అన్నిటికీ ప్రజల వద్ద సమాధానం ఉంది.. అందుకే జగన్ రెడ్డి పాలస్ లో బందీ గా మిగిలిపోయాడు..

  3. పార్టీ వెన్నంటే ఉన్న కార్యకర్తలను మోసం చేసిన జగన్ కి తగిన శాస్తి జరిగింది.రాజకీయం ఎలా చేయకూడదు అనేదానికి జగన్ చక్కటి ఉదాహరణ.

  4. అది అతివృష్టి అనావృష్టి కాదు “మూడ్ స్వింగ్స్” అనగా ఏమీ చెయ్యాలో అర్థం కానపుడు స్థిరత్వం లేని ( గందరగోళం) నిర్ణయాలు తీసుకోవడం. It usually indicates తిరోగమనం as per psychology.

  5. అది అతి??వృష్టి అనా??వృష్టి కాదు “మూ??డ్ స్విం??గ్స్” అనగా ఏమీ చెయ్యాలో అర్థం కానపుడు స్థిర??త్వం లేని ( గందరగో??ళం) నిర్ణయాలు తీసుకోవడం. It usually indicates తిరోగమ??నం as per psy??cholo??gy.

  6. అది అతి??వృష్టి అనా??వృష్టి కాదు “మూ??డ్ స్విం??గ్స్” అనగా ఏమీ చెయ్యాలో అర్థం కానపుడు స్థిర??త్వం లేని ( గందరగో??ళం) నిర్ణయాలు తీసుకోవడం.

  7. అది అతి??వృ??ష్టి అనా??వృ??ష్టి కాదు “మూ??డ్ స్విం??గ్స్” అనగా ఏమీ చెయ్యాలో అ??ర్థం కానపుడు స్థిర??త్వం లేని ( గందరగో??ళం) నిర్ణయాలు తీసుకోవడం. It usually indicates తిరోగమ??నం as per psy??cholo??gy.

  8. ఒక్క చాన్స్ అంటె ఇచ్చిన వారికి…. అన్న ఈ పద్యం గుర్తు చెసాడు!

    .

    కనకపు సింహాసనమున

    శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం

    దొనరగ బట్టము గట్టిన

    వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

  9. అది అ?తి??వృష్టి అ??నా??వృష్టి కాదు “మూ??డ్ స్విం??గ్స్” అనగా ఏమీ చెయ్యాలో అర్థం కానపుడు స్థిర??త్వం లేని ( గంద??రగో??ళం) నిర్ణయాలు తీసుకోవడం. It usually indicates తిరోగమ??నం as per p??sy??cholo??gy.

  10. అది అ?తి??వృష్టి అ??నా??వృష్టి కా??దు “మూ??డ్ స్విం??గ్స్” అనగా ఏమీ చెయ్యాలో అర్థం కానపుడు స్థిర??త్వం లేని ( గంద??రగో??ళం) నిర్ణయాలు తీసు??కోవడం. It usually indicates తిరో??గమ??నం as per p??sy??cholo??gy.

  11. అ-ది అ-తి-వృ-ష్టి అ-నా-వృ-ష్టి కా-దు “మూ-డ్ స్విం-గ్స్” అ-న-గా ఏ-మీ చె-య్యా-లో అ-ర్థం కా-న-పు-డు స్థి-ర-త్వం లే-ని ( గం-ద-ర-గో-ళం) ని-ర్ణ-యా-లు తీ-సు-కో-వ-డం. It usually in–di–cates తి-రో-గ-మ-నం a-s p-e-r p–sy–ch–o–lo–g-y.

  12. గందరగోళం లో ఏమి పాలుపోని పరిస్థితుల్లో చేసే చేష్టలను భలే కవర్ చేసారు.

  13. ప్రేమ?? అభిమానం??

    వాటికి అర్థం and విలువ తెలియని పశువు ఈడు, అందుకే సొంత అమ్మా చెల్లెళ్ళకి ఈ గతి పట్టించాడు

    1. mari sontha mama ni, pillani ichhi brathuku theruvu chupinchina vyakthini , vennupotu podichi , ayana chavuku karana maina vyakthi neeku devuda? puskaralalo 40 mandini pottana pettukunnodu neeku devuda ? tirupathi balaji swami laddu ni thana swartham kosam vadukunna vyakthi neeku devuda (supreme court tho baaga cheevatlu thinnaru ga yee vishayam lo), inka chebithe oka vyakthi ki elanti durgunalu elanti avalakshanalu undakudado anni unna vyakthi ani sakshath pillanichhina mamatho anipinchukunna vyakthi meeku devuda ? pasuvukaina oka debba vesthe mata vintundi, kani athanu(ade mee nayakudu) pasuvulakante heenam

  14. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  15. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  16. Sajjalanu bayatiki pampalsina time lo, vijaya sai ni bayatiki pampaaru, what a pity, mari nellore mp seat yenduku icharo? Yemi politics chesthunnar sir.. Scripts lo irukku poyaadu, script ichevaadiney unchuthaadu

  17. ప్రేమ?? అభిమానం??

    వాటికి అర్థం and విలువ తెలియని “పశువు ఈడు, అందుకే సొంత “అమ్మా చెల్లెళ్ళకి ఈ గతి’ పట్టించాడు

    “అవినాష్ & పెళ్ళాం” ఒత్తిడి తెస్తే, బాబాయ్ నే లేపేయి0చి తాపిగా ఎద్దులబండి లో ‘రాత్రికి చేరుకున్నాడు.

    తండ్రి flight కూలిపోతే వెదకడానికి అభిమానులు పోయారు ‘కానీ ఈడు పోలేదు..

    కనీసం ‘ముక్కలకి p0st మార్టం జరిగిన కర్నూల్ హాస్పిటల్ కి కూడా పోకుండా MLA లు, చిరంజీవితో సంతకాలు పెట్టించుకోవడానికి పెళ్ళాని పంపాడు.

    ఇలాంటి ‘ఎదవకి కార్యకర్తలు, and పార్టీవర్కర్స్ మీద సెంటిమెంట్స్ & ప్రేమ అభిమానాలు ఉంటాయoటావా గ్యాసు ఆంధ్రా??

  18. జగన కి ఏమాత్రం ఛాన్స్ లేదు. జగన్ మీద గతం లో వున్న ముప్పై కేసుల కి తోడు సరిగ్గా చేస్తే మరో ముప్పై కేసులు పడతాయి. సుప్రీం కోర్ట్ మరెంతో కాలం వెయిట్ చేసే అవకాశం తక్కువ. ఏ సమయంలోనైనా జగన్ జైలు వెళ్లే అవకాశం వుంది. అదే సమయంలో వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , భారతి లకి కూడా జైలు తప్పేట్టు లేదు. వైసీపీ ని నడిపే వారువుండరు. పెద్దలు జగన్ కి రెండే options ఇచ్చారు.

    1 ) . వైసీపీ అధికారికంగా క్లోజ్ చేసి లండన్లో హ్యాపీగా స్థిరపడటమా

    2 ) . జైలు కెళ్ళి వైసీపీ అనధికారికంగా క్లోజ్ చెయ్యటమా .

    పై రెండు విషయాలలోనూ వైసీపీ క్లోజ్ అవ్వటమా మాత్రం కామన్. ఇక మిగిలింది వైసీపీ కార్యాలయాలకి రంగులు మార్చి బీజేపీ బోర్డు లు తగిలియ్యటమే.

  19. ఇలాంటి ప్రవర్తన ఒక మంచి నాయకుడికి వుండాల్సింది కాదని చిన్న పిల్లాడ్ని అడిగినా చెపుతారు.

Comments are closed.