అనిత‌పై అంత మాట అన్నావేంద‌య్యా!

ఏపీ హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌పై మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ విమ‌ర్శ‌లు చేయ‌డం కొత్తేమీ కాదు.

ఏపీ హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌పై మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ విమ‌ర్శ‌లు చేయ‌డం కొత్తేమీ కాదు. చాలా కాలం నుంచి ఇద్ద‌రి మ‌ధ్య డైలాగ్ వార్ సాగుతోంది. అమ‌ర్నాథ్ మంత్రి ప‌ద‌విలో వుండ‌గా, అనిత తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసేవారు. అందుకు కౌంట‌ర్‌గా గుడివాడ కూడా చుర‌క‌లు అంటించేవారు. ఇప్పుడు పాత్ర‌లు మారాయి. వ్య‌క్తులు వాళ్లే.

తాజాగా అనిత‌పై అమ‌ర్నాథ్ పెద్ద మాటే అన్నార‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. మీడియాతో గుడివాడ అమ‌ర్నాథ్ మాట్లాడుతూ త‌న‌పై హోంమంత్రి అనిత విమ‌ర్శ‌లపై స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అనిత రీల్స్ చూసుకుని కాల‌క్షేపం చేస్తే మంచిద‌ని అమ‌ర్నాథ్ వెట‌క‌రించడం గ‌మ‌నార్హం.

అలాగే వైసీపీ నుంచి వెళ్లిపోయే వాళ్ల గురించి అమ‌ర్నాథ్ ఘాటు వ్యాఖ్య చేశారు. త‌మ పార్టీ నుంచి మారేవాళ్ల‌ను స‌ముదాయిస్తామే త‌ప్ప‌, కాళ్లు ప‌ట్టుకోలేమ‌ని అన్నారు. గ‌తంలో చంద్ర‌బాబునాయుడి నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

వైఎస్ జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. వైసీపీకి, రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా నేప‌థ్యంలో అమ‌ర్నాథ్ కామెంట్స్ పాధాన్యం సంత‌రించుకున్నాయి. నాయ‌కుల్ని త‌యారు చేసే శ‌క్తి జ‌గ‌న్‌కు వుంద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం బెదిరింపుల‌తో నాయ‌కుల‌పై ఒత్తిడి తెస్తోంద‌న్నారు. అయితే కొంద‌రు త‌ట్టుకుంటార‌ని, మ‌రికొంద‌రు త‌ట్టుకోలేర‌న్నారు. త‌న‌పై కూడా విజిలెన్స్ విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు.

7 Replies to “అనిత‌పై అంత మాట అన్నావేంద‌య్యా!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. గుడ్డు గుర్నాదం గారు…తమరు గుడ్లు లెక్క పెట్టుకొండి…ఎన్ని ఉన్నాయో ఎన్ని జంప్ అయ్యాయో

  3. !గుడ్డు గుర్నాదం గారు…తమరు గుడ్లు లెక్క పెట్టుకొండి…ఎన్ని ఉన్నాయో ఎన్ని పగిలి పోయాయో

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  5. బటన్ నొక్కడం ఏమంత పెద్దపని, ఆఫీస్ లో అటెండెంట్ కూడా నొక్కుతాడు అని అన్నారు..

    .

    మరి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యింది.. ఇంతవరుకు బటన్ ఎందుకు నొక్కలేదు…. అంటే అటెండెంట్ చేసే పని కూడా చేయలేరా. ?

Comments are closed.