సర్కారువారి పాట సినిమాతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చాడు దర్శకుడు పరశురామ్. మహేష్ తో సినిమా చేసిన ఉత్సాహంలో ఉన్న ఈ దర్శకుడు, ఇప్పుడు ప్రభాస్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాయడానికి రెడీ అవుతున్నాడు పరశురామ్. ఎప్పట్నుంచో తన మనసులో ఉన్న పాయింట్ ను ప్రభాస్ మేనరిజమ్స్, ఇమేజ్ కు తగ్గట్టు కథగా మార్చాలని అనుకుంటున్నాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కుదిరితే ఈ గ్యాప్ లోనే ప్రభాస్ కు స్టోరీలైన్ వినిపించాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ప్రభాస్ కనుక ఓకే చెబితే.. అదే లైన్ పై పూర్తిస్థాయిలో వర్క్ మొదలుపెట్టాలనేది పరశురామ్ ఆలోచన.
ఒకవేళ ప్రభాస్ తోనే సినిమా తీయాలని పరశురామ్ ఫిక్స్ అయితే మాత్రం అతడి కెరీర్ లో మరోసారి లాంగ్ గ్యాప్ తప్పదు. ఎందుకంటే, ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రాజెక్ట్-కె, సలార్ సినిమాలు పూర్తవ్వాలి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ (స్పిరిట్), మారుతి సినిమాలున్నాయి. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత పరశురామ్ కు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికైతే సర్కారువారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు పరశురామ్. త్వరలోనే అతడు నాగచైతన్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.