పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన దేవా థియేటర్లలోకొచ్చింది. ఆల్రెడీ ఒకరోజు గడిచింది. రిజల్ట్ ఏంటనేది బయటకొచ్చింది. మరి పూజాహెగ్డేకు ఈ సినిమా కలిసొచ్చిందా..?
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పూజాహెగ్డేకు సడెన్ గా ఆఫర్లు తగ్గాయి. ఆమె పాపులారిటీ పడిపోయింది. ఉన్నఫలంగా ఖాళీ అయిపోయింది. అలాంటి టైమ్ లో ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా దేవా.
ఈ సినిమా సక్సెస్ తో మరోసారి లైమ్ లైట్లోకి రావాలని ఇన్నాళ్లూ కలలుకనింది పూజాహెగ్డే. అందుకే సినిమాకు గట్టిగా ప్రచారం చేసింది. కాస్త లైన్ దాటి మరీ అల్ట్రా మోడ్రన్ దుస్తులు ధరించి, మీడియా ముందుకొచ్చింది.
అయితే పూజాహెగ్డేకు ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే కలిసొచ్చిందని చెప్పాలి. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమె హార్ట్ టచింగ్ గా ఓ పోస్ట్ పెట్టినప్పటికీ, సినిమా ఆ స్థాయిలో లేదనేది వాస్తవం.
దేవా సినిమాకు మొదటిరోజే మిక్స్ డ్ రిజల్ట్ వచ్చింది. రెండో రోజుకు వసూళ్లు మరింతగా తగ్గిపోయాయి. షాహిద్ యాక్టింగ్ బాగున్నప్పటికీ క్లయిమాక్స్ సంతృప్తికరంగా లేదంటున్నారు చాలామంది. ఇక సినిమా తొలిభాగంలో చూపించిన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్ లో మిస్సయిందనే వాళ్లు కూడా ఉన్నారు.
ఇక పూజాహెగ్డే విషయానికొస్తే.. ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్ టైమ్ ఇవ్వలేదంటున్నారు. పైగా సినిమాలో కంటే బయటే ఆమె హాట్ గా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా పూజాహెగ్డే కెరీర్ కు దేవా సినిమా కలిసొచ్చేలా లేదు.
రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో తెలుగులో ఆమెకు పూర్తిగా తలుపులు మూసుకుపోయాయి. చేతివరకు వచ్చిన నాగచైతన్య సినిమా కూడా చేజారింది. ఇక పూజాహెగ్డేకు మిగిలిన ఒకే ఒక్క అవకాశం విజయ్ తో చేస్తున్న సినిమా మాత్రమే.
Bimb prabhas pettadu ga