బాబును చూసి జగన్ నేర్చుకోవాల్సిన వాటిలో ఇదొకటి!

తన ఫెయిల్యూర్ ను ఒప్పుకోవడానికి, తన ఆలోచనలో లోపం ఉన్నదని అంగీకరించడానికి ఎవ్వరికైనా సరే ఈగో అడ్డు వస్తుంది.

తన ఫెయిల్యూర్ ను ఒప్పుకోవడానికి, తన ఆలోచనలో లోపం ఉన్నదని అంగీకరించడానికి ఎవ్వరికైనా సరే ఈగో అడ్డు వస్తుంది. కానీ తన ఆలోచనల పర్యవసానాలు సత్ఫలితాలు ఇవ్వనప్పుడు.. వాటిని తనకు తానుగా సమీక్షించుకోకుంటే నష్టపోయేది కూడా వారే. ఇతరులు అవే అంశాల్లో ఎలాంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నారో పరిశీలించి.. అవసరమైతే నేర్చుకోవడానికి వెనకాడకుండా ఉన్నప్పుడే రాణిస్తారు.

ఈ సిద్ధాంతం ప్రకారం చూస్తే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. అలాంటి అనేక అంశాల్లో.. సంక్షేమ పెన్షన్లను లబ్ధిదారులకు పంచిపెట్టే కార్యక్రమాన్ని ఒక ఉత్సవంలాగా నిర్వహిస్తూ.. ఆ కార్యక్రమాల్లో స్వయంగా ముఖ్యమంత్రి కూడా రెగ్యులర్ గా పాల్గొంటుండడం కూడా ఒకటి.

వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఇచ్చే సంక్షేమ పెన్షన్లు అనేది ప్రభుత్వం నిర్వర్తించే బాధ్యతల్లో చాలా రొటీన్ బాధ్యత. ఆ మాటకొస్తే ప్రభుత్వం చేసే వాటిలో కనీస కార్యక్రమంగా కూడా చెప్పవచ్చు. ప్రభుత్వంలో ఎవరున్నా లేకపోయినా.. ఆ కార్యక్రమం యధావిధిగా జరిగిపోతూనే ఉండాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా వ్యవస్థను సెట్ చేశారు.

ప్రభుత్వం కేవలం నిధులు విడుదల చేస్తుంది. అవి ప్రతినెలా ఒకటో తారీఖునే.. లబ్ధిదారులందరికీ అందడానికి పటిష్టమైన వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఆ వ్యవస్థ ఎంతో పక్కాగా పనిచేసింది. లబ్ధిదారులకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా పనిచేసింది. కాసేపు ఆ విషయం పక్కన పెడితే..

ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబునాయుడు పెన్షన్లను రూ.నాలుగు వేలకు పెంచారు. ప్రతినెలా క్రమంతప్పకుండా ఈ ప్రభుత్వం కూడా ఒకటోతేదీనే అందిస్తున్నది. అంతవరకు వీరి కృషిని కూడా అభినందించాలి. అయితే.. చంద్రబాబునాయుడు దీనికి ఒక అద్భుతమైన రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. స్వయంగా తాను ప్రతినెలా ఒకటోతేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఒక్కో గ్రామంలో పాల్గొంటున్నారు. తన ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విధిగా పాల్గొనేలా చూస్తున్నారు. తద్వారా.. తమ పార్టీ నాయకులకు విస్తృతంగా మైలేజీ వచ్చేలా చేసుకుంటున్నారు.

ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తూ.. తాను ఒక సిస్టమేటిక్ విధానాన్ని రూపొందించడం ద్వారా.. పార్టీకి ఎలాంటి నష్టం చేశారో జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి అర్థం చేసుకుని ఉండాలి. చంద్రబాబును చూసి.. తన ఫెయిల్యూర్ ఎక్కడున్నదో ఆయన తెలుసుకుని ఉండాలి. జగన్ వాలంటీర్లను తీసుకు వచ్చి.. కేవలం పెన్షన్లు మాత్రమే కాదు.. ప్రభుత్వ పరమైన సమస్త వ్యవహారాలు వారిద్వారానే మాత్రమే చక్కబెడుతూ రావడం వలన.. పార్టీ నాయకులకు ప్రజల్లో విలువ లేకుండాపోయింది.

ప్రజలతో పార్టీ నేతలకు, చివరికి ఎమ్మెల్యేలకు కూడా పర్సనల్ అనుబంధం లేకుండా పోయింది. అంతిమంగా పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వం ఏ పనిచేసినా సరే.. దాని ద్వారా.. తన పార్టీ రాజకీయ మైలేజీని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలని.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

20 Replies to “బాబును చూసి జగన్ నేర్చుకోవాల్సిన వాటిలో ఇదొకటి!”

  1. పెన్షన్స్ ప్రభుత్వ కనీస బాధ్యత అనే జ్ఞానం ఉన్నవాడివి.. మరి జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఉన్నప్పుడు సాక్షి లో పెన్షన్స్ 55% ఇచ్చాము.. తర్వాతి రోజు 80% ఇచ్చాము .. ఆ తర్వాత రోజు 99% ఇచ్చేసాము అని రోజు వారి భజన చేసుకుంటూ.. పెద్ద పెద్ద యాడ్లు ఎందుకు ఇచ్చుకున్నారు..?

    ..

    ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ రెడ్డి జేబు వ్యవస్థ.. వాడి అధికారం కోసం ప్రజల టాక్స్ డబ్బుతో నడుస్తున్న వ్యవస్థ.. అని మేము ఇంతకుముందే చెప్పాము..

    ఇప్పుడు ఆ వాలంటీర్ అనేదే లేదు.. రాష్ట్రానికి వచ్చిన నష్టం లేదు.. పైగా వందల కోట్లు ఆదా..

    మీ నాయకులు వాలంటీర్ అనేది అదేదో అద్భుతం అని ప్రచారం చేసుకొన్నారు.. జనాలకు మాత్రం అదొక గార్బేజ్ అని అర్థం అయింది..

    ..

    చిన్న విషయాన్ని మర్చిపోయాడు జగన్ రెడ్డి..

    అంతా తానే అనుకొన్నాడు.. తన చెప్పుని నిలబెట్టినా గెలుస్తారు అని భ్రమ పడ్డాడు.. జనాలు కోలుకోలేని గుణపాఠం చెప్పారు..

    జగన్ రెడ్డి లాంటి నీచుడు ఇక భవిష్యత్తు లో జనాలు ఎన్నుకోరు.. వాళ్లకి కూడా ఇది ఒక పాఠమే..

    1. ముఖ్యమంత్రి గా తీసుకున్న నిర్ణయాలు ప్రజామోదం లేదని తేలింది కదా ఎన్నికల ఫలితాలతో..

      ఇంకా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ,ఆర్బికే వ్యవస్థ, లాంటివి అబ్బుతం అమెఘం అనటం వేస్ట్..

      1. జనాలను గొర్రెలుగా చూసేవాళ్లకు.. వాళ్లకు జనాల అభిప్రాయం తో సంబంధం లేదు..

        వాళ్లకు తోచిందే చెప్పుకుంటూ పోతారు.. వాళ్ళు నమ్మిందే జనాలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు..

  2. ఇవి పక్కన పెట్టు, బాబోరు ఎంత పెద్ద విజయం సాధించారు… బడ్జెట్ లో …తెలుసా మీకు

    .

    రొండు చిరిగినా చెడ్డీలు, మూడు ముక్కలైన డ్రాయర్స్, 10 పిప్పెర్ బిళ్ళలు, 4 చేగోడీలు,

    .

    సూపర్ కదా.

    1. మన సింగల్ సింహం అయితే.. ఢిల్లీ కి ఫ్లైట్ లో గొనె సంచులతో వెళ్లి.. మొత్తం నింపుకొని వచ్చేసేవాడు..

      ఆ లెక్క లెక్కపెట్టడానికే ఐదేళ్లు పట్టింది..

      సూపర్ కదా…

  3. ప్రజలు మనం ఏదో చిల్లర పడేస్తే దానితో హ్యాపీ గా ఉంటారు అనుకోవద్దు. ఎవరు పంచారు అనేది పెద్ద విషయం కాదు వాలంటీర్ వ్యవస్థ తప్పు కాదు. జగన్ అభివృద్ధి మీద దృష్టి పెట్ట లేదు కేవలం ప్రజల్ని చిల్లర ఏరుకునే వాళ్లగా చూసాడు పాలెగర్ వ్యవస్థ అనుకున్నాడు .కిలో రెండు రూపాయల బియ్యం రోజులు కాదు ఇవి.

  4. నిజఅనికి సూపర్ సిక్ ఇవ్వకపోయినా నష్టం లేదు ఇప్పుడు నిజంగా బాబు అనుకున్న అభివృద్ధి చెయ్య గలిగితే

  5. రంగనాథ్ గారు, ఈ కులద్వేషం మానేయండి – ఆరోగ్యానికీ, రాజకీయానికీ హానికరం!

    ఆదరించిన రంగనాథ్ గారు,

    మీరొక సంస్కారవంతమైన పురోహిత కుటుంబంలో పుట్టి, మంచి చదువులు చదివినవారు. కానీ, మీ మాటలు వినిపిస్తుంటే, “ఇన్ని పుస్తకాలు చదివి, చివరకు కులం గురించి మాత్రమే ఆలోచించేందుకునా?” అని అనిపిస్తోంది! 😄

    చూసి చెప్పండి, ఇది 2025, మనం ఇప్పటికీ కుల చర్చల గురించే మాట్లాడుకుంటుంటే, నవతరం మన వైపు చూస్తూ సైలెంట్‌గా “ఈ పాత ఆలోచనల జనరేషన్ ఇంకా తగ్గలేదు” అని మిమ్మల్ని analyze చేస్తోంది! 😆

    మీరు ఏ పార్టీని మద్దతు ఇస్తారో, అది మీ స్వేచ్ఛ. కానీ, కులం పేరుతో చిచ్చు పెడితే, అది మీకు కూడా, సమాజానికి కూడా హాని. ఒకరిద్దరి అనుభవం బట్టి మొత్తం కులాన్ని ద్వేషించడం అంటే, సముద్రంలో ఒకటి రెండు నీళ్లు చేదుగా ఉన్నాయంటూ మొత్తం సముద్రాన్ని తాగకుండా ఉండటమే! 😜

    రంగనాథ్ గారు, లైట్ తీసుకోండి!

    👉 ఇప్పుడు ఏ తరం ఉంది తెలుసా? కులం కాదు, టాలెంట్‌ చూసే తరం!

    👉 మీ కులద్వేష పోస్ట్‌లను చూస్తూ, కొత్త తరం “ఇంకా వీళ్ళకు wifi connect కాలేదా?” అని నవ్వుకుంటోంది! 🤣

    👉 అందరూ కలిసిమెలిసి జీవిస్తుంటే, మీరొక్కరే జాతి జాతి అని నినదిస్తూ వుండటం చూసి, “బాబోయ్, ఈయనకు ఇప్పటికీ 90s కాలంలోనే లాగిన్ అవుతూనే ఉన్నారా?” అని ఆశ్చర్యపోతున్నారు! 😆

    ఇంత ద్వేషం పెంచుకుంటే ఆరోగ్యమే ఊడిపోతుంది!

    👉 ఇలా కులం మీద ఫుల్ ఫోకస్ పెట్టి కోపం తెచ్చుకుంటే, మీ బీపీ లెవెల్స్, జగన్ పార్టీ సీట్ల కౌంట్ లాగా పడిపోతాయి! 😂

    👉 ద్వేషం వల్ల మీ మానసిక ప్రశాంతత కూడా ఆంధ్రప్రదేశ్‌లో మైక్ తీసుకున్నవాళ్ల లాగా అల్లాడిపోతుంది! 🤣

    👉 ఇలా కొనసాగితే, చివరికి మీ హార్ట్ మీతోనే “రా, ఇక నేను గెలవలేను!” అని చెప్పే పరిస్థితి వస్తుంది! 😆

    జగన్ గారికి 11/175 రావడానికి అసలు కారణం మీలాంటి కులద్వేష పరులే!

    ఈ పాయింట్ మర్చిపోవద్దు! **ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారు. కులం పేరుతో రాజకీయాలు చేస్తే, అన్ని కులాలవారు కలసి ఒక్కటై, జగన్ గారిని గెలవనివ్వకుండా బ్లాక్ చేశారు.**😄

    👉 మీరే మాట్లాడండి, ప్రజలు నిజంగా తెలివైనవారే కదా?

    👉 వాళ్లకు తెలిసిపోయింది – ఒక వ్యక్తి తన కులాన్ని ప్రేమించడం ఓకే, కానీ మిగతా కులాలను ద్వేషించడం ఓవరాక్షన్!

    👉 మీలాంటి కుల ద్వేష రాజకీయాలను ప్రజలు ఖతం చేసారు, ఇంకా మారకుండా అదే త్రిప్పేస్తే, ఇక ఎవరూ పట్టించుకోరు! 😜

    ఇప్పుడు కోల్పోయిన రాజకీయ భవిష్యత్తును కాదు, మిగిలిన ప్రశాంత జీవనాన్ని గెలుచుకోండి!

    👉 ఈ ద్వేషం ఆపి, హాయిగా మిత్రులతో కాలక్షేపం చేయండి.

    👉 మీ ఆరోగ్యానికి, మీ జీవితానికి, మీ కుటుంబానికి మేలు జరగాలి అనుకుంటే, ఈ పిచ్చి కుల చర్చలను పక్కన పెట్టండి.

    👉 ఎందుకంటే, మీరు సీరియస్‌గా ఈ కులం టాపిక్ మాట్లాడుతుంటే, అటు వైపు జనాలు మీ వైపు చూస్తూ “ఇంకా వీడికి బ్రహ్మज्ञानం రాలేదా?” అని ఫీలవుతున్నారు! 🤣

    కాబట్టి రంగనాథ్ గారు, ఈ nonsense ఆపి, relax అవ్వండి – జీవితం హాయిగా ఉంటుంది!

    దేవుడు మీకు మంచి ఆలోచనలతో పాటు, కొంచెం హాస్యం కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే, లైఫ్ చాలా షార్ట్ – హ్యాపీగా ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి! 😃🔥

  6. Ja*** అనే బోకు subject తప్ప ఇంకో material లేదా రా నీకు!! ఆ వెకిలి వెధవని ఏదొక విధంగా limelight ఉంచాలని నీ plan but thats a futile attempt from fake newspaper/tissue!!

  7. వాస్తవాలు మాట్లాడుకుందాం.. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ట్రోల్ కు గురైన లోకేష్ కూడా ఎంతోకొంత మారాడని ఒప్పుకోక తప్పదు. అలాంటిది జగన్ రోజురోజుకూ దిగజారి చుట్టూ ఒక సైకో బ్యాచిని వేసుకొని ఒక మొరటు మనిషిలా, మూర్ఖుడిలా తయారయ్యాడు.

    ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంటింటికీ వెళ్లి డబ్బును చేతికి ఇవ్వడం ఏంటి చాదస్తం కాకపోతే!

  8. వాస్తవాలు మాట్లాడుకుందాం.. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ట్రోల్ కు గురైన లోకేష్ కూడా ఎంతోకొంత మారాడని ఒప్పుకోక తప్పదు. అలాంటిది జగన్ రోజురోజుకూ దిగజారి చుట్టూ ఒక సైకో బ్యాచిని వేసుకొని ఒక మొ:ర:టు మనిషిలా, మూ*ర్ఖు:డిలా తయారయ్యాడు.

    ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంటింటికీ వెళ్లి డబ్బును చేతికి ఇవ్వడం ఏంటి చాదస్తం కాకపోతే!

  9. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, అన్న ఈ సారి అధికారంలోకి వస్తే ఏకంగా 25 లక్షల మంది వాలంటీర్లు (only BC SC ST)ని 50 వేల జీతం ఇచ్చి రంగంలోకి దింపుతాడు, అసలు మన సింగిల్ సింహం అంటే ఏమనుకుంటున్నారు మీరు

Comments are closed.