ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో అశ్వనీదత్ నిర్మిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. భారీ రేట్లకు మార్కెట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు విడుదల అవుతుందా అన్న క్లారిటీ లేదు.
ఒకసారి డేట్ అన్నది ఇచ్చారు. మే 9. కానీ ఎన్నికలు వచ్చిపడడంతో వాయిదా తప్పలేదు. లేటెస్ట్ గా మే నెలాఖరు అని వినిపిస్తోంది కానీ అధికారికంగా అయితే కాదు. జూన్ రెండో వారం తరువాత కానీ కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం వర్క్ స్టార్ట్ కాదు.
భారీ రేట్లకు మార్కెట్ చేసే ప్రాజెక్ట్ కె సినిమాకు టికెట్ రేట్ల పెంపు అవసరం. నైజాంలో సమస్య లేదు. కానీ ఆంధ్రలో ప్రభుత్వం లేకుండా రేట్ల పెంపు ఇవ్వడం అధికారులకు సాధ్యమవుతుందా? ఇది ఒక సమస్య.
తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ మద్దతు దారు అయిన అశ్వనీదత్ ఈసారి ప్రభుత్వం మారుతుందని నమ్మకంగా వున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తనకు అనుకూలంగా భారీ రేట్లు తెచ్చుకోవచ్చు అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల జూన్ రెండో వారం తరువాత విడుదల చేస్తే ఇది సులువు అవుతుంది.
ఒక వేళ ప్రభుత్వం మారకపోతే, మళ్లీ జగన్ నే వస్తే, ప్రభాస్ వైపు నుంచి నరుక్కు వస్తారు. మరీ భారీ రేట్లు రాకపోయినా, ఓ వంద రూపాయల పెంపు చాన్స్ వుంటుంది. ఇదిలా వుంటే, కొన్ని కీలకమైన సినిమా ఫుటేజ్ కూడా ఇంకా రావాల్సి వుందని తెలుస్తోంది. అది ఎప్పుడు వస్తుంది అన్న క్లారిటీ పక్కాగా వస్తే, అప్పుడు డేట్ అనౌన్స్ చేసే అవకాశం వుంది. అది జూన్ లో వుంటుందా? జూలైలో వుంటుందా? ఇంకా వెనక్కు వెళ్తుందా అన్నది తెలియాల్సి వుంది.