పుష్ప సాంగ్ లీక్

డిజిటల్ కాలంలో ఏదీ ఎంతకాలమో దాచి వుంచలేకపోతున్నారు. మొన్నటికి మొన్న సర్కారువారిపాట టీజర్ లీక్ అయింది. దాంతో రాత్రికి రాత్రి అనుకున్నదానికన్నా ముందుగా టీజర్ ను విడుదల చేయాల్సి వచ్చింది. Advertisement ఇప్పుడు బన్నీ…

డిజిటల్ కాలంలో ఏదీ ఎంతకాలమో దాచి వుంచలేకపోతున్నారు. మొన్నటికి మొన్న సర్కారువారిపాట టీజర్ లీక్ అయింది. దాంతో రాత్రికి రాత్రి అనుకున్నదానికన్నా ముందుగా టీజర్ ను విడుదల చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు బన్నీ సినిమా పుష్ప వంతు వచ్చింది. దాక్కో దాక్కో మేక అంటూ సాగే పాటను శుక్రవారం సాయంత్రం విడుదల చేయాల్సి వుంది.

కానీ ఆ పాట ముందుగా గురువారం సాయంత్రమే లీక్ అయిపోయింది. రఫ్ వెర్షన్ కావచ్చు, దేవీ పాడిన ట్రాక్ కావచ్చు కానీ ఎలా లీక్ అయిందన్నది పాయింట్. ఇప్పుడు దీని మీద ఆరా మొదలయింది. 

పాట ఎలా వుంది..మిగిలిన విషయాలు ఇప్పుడు డిసైడ్ చేసేవి కాదు. ఎందుకంటే రఫ్ వెర్షన్ కావడం, దేవీ పాడిన ట్రాక్ కావడం, విజువల్స్ లేకపోవడం వల్ల దీన్ని జడ్జ్ చేయడం సరికాదు. 

మరి ఇప్పుడు ఈ లీక్ ఫలితంగా పుష్ప సాంగ్ ను కాస్త ముందుగా విడుదల చేస్తారా? లేక రేపు సాయంత్రమే విడుదల చేస్తారా? అన్నది చూడాల్సి వుంది.