వైవాహిక బంధంలోకి బ్యాడ్మింటన్ స్టార్

భారతీయ బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

భారతీయ బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కోర్టులో మెరుపులు మెరిపించిన ఈ స్టార్, ఇప్పుడు వైవాహిక జీవితాన్ని కూడా సూపర్ హిట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

పోసిడెక్స్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ వెంకట దత్తసాయితో పీవీ సింధు వివాహం రాత్రి ఘనంగా జరిగింది. ఉదయ్ పూర్ లో ఆదివారం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు పీవీ సింధు, దత్తసాయి పెళ్లితో ఏకమయ్యారు.

ఉదయ్ పూర్ లోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన ఓ పెళ్లికి కేవలం ఇరుకుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. అటుఇటుగా 140 మంది బంధువులు మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. దీనికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు.

నిజానికి 20వ తేదీ నుంచే సింధు పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, సంగీత్.. ఇలా అన్ని కార్యక్రమాలు ఆర్భాటంగా నిర్వహించారు. అయితే సెలబ్రిటీ పెళ్లిళ్లలో జరిగినట్టు ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకురాలేదు.

One Reply to “వైవాహిక బంధంలోకి బ్యాడ్మింటన్ స్టార్”

Comments are closed.