ప్రశ్నించడం ఎంతో ఈజీ. కానీ జవాబు చెప్పడమే చాలా కష్టం. అందులోనూ ప్రేమ సంబంధమైన ప్రశ్నలను ఎదుర్కొనే హీరోయిన్ల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలే తప్ప అంచనా వేయలేం.
అభిమానుల వింత ప్రశ్నలను ఎదుర్కొనేందుకు చాలా గుండె నిబ్బరం ఉండాలి. ఆ సహనం దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు కొంచెం ఎక్కువే అని చెప్పాలి.
శ్రుతిహాసన్ జీవితంలో అనేక మలుపులున్నాయి. ప్రేమ, బ్రేకప్, సినిమాలు …ఇలా వైరుధ్యం, వైవిధ్యంతో కూడిన జీవితం శ్రుతి హాసన్ సొంతం. లవ్ బ్రేకప్ కావడంతో, దాని నుంచి బయట పడేందుకు ఆమె సంగీతాన్ని, మళ్లీ సినిమాలను ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఆమె సినిమాలతో బీజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులతో ఈ అందాల భామ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ ఏడాదిలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఆమె ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చారు.
తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పారేశారు. అలాగే మీరు ముక్కుకు సర్జరీ చేయించుకున్నారా? అని ప్రశ్నించగా …ఏడేళ్ల క్రితం నాటి సంఘటనను ఇంకా పట్టుకుని వేలాడుతున్నారా? అని సున్నితంగానే మొట్టికాయలు వేశారు. క్రాక్ ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించగా …. బిజీగా ఉండడం వల్ల వీలు కాలేదని సమాధానం ఇచ్చారు.
మీ మాజీ ప్రియుడు మైకేల్ గుర్తుకు వస్తే అసహ్యం వేస్తుందా? అని ఓ అభిమాని ప్రశ్నకు శ్రుతి కాసేపు ఆలోచనలో పడి, తర్వాత తేరుకుని గట్టి కౌంటర్ ఇచ్చారు. 'మీరు నిజంగా చెడ్డవారు. ఎందుకంటే, నేను ఎవరినీ ఆసహ్యించుకోను. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. అయితే లోలోపల కాస్త బాధపడతాను' అని స్పష్టంగా ఆమె సమాధానం ఇచ్చారు.