రాజశేఖర్ నెక్ట్స్ సినిమా అదే!

'పీఎస్వీ గరుడ వేగ'తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుగా అగుపించిన సీనియర్ హీరో రాజశేఖర్ తన తర్వాతి సినిమాతో జస్ట్ ఓకే అనిపించారు. 'కల్కి'తో హిట్ ను అందుకోలేకపోయిన రాజశేఖర్ ఇప్పుడు మరో సారి…

'పీఎస్వీ గరుడ వేగ'తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుగా అగుపించిన సీనియర్ హీరో రాజశేఖర్ తన తర్వాతి సినిమాతో జస్ట్ ఓకే అనిపించారు. 'కల్కి'తో హిట్ ను అందుకోలేకపోయిన రాజశేఖర్ ఇప్పుడు మరో సారి థ్రిల్లర్ నే నమ్ముకున్నారు. తమిళ ప్రొడ్యూసర్ ఒకరు ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇది వరకూ విజయ్ ఆంటోనీతో 'భేతాళుడు' వంటి థ్రిల్లర్ ను రూపొందించిన ప్రదీప్ కృష్ణమూర్తి రాజశేఖర్ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడే తెలుగు సినిమా 'క్షణం'ను కూడా తమిళంలో రీమేక్ చేశాడట. 

ఈ సినిమా కథను రాజశేఖర్ సింగిల్ సిట్టింగులో ఓకేశారని, త్వరలోనే షూటింగ్ మొదలుపెడుతున్నట్టుగా వచ్చే ఏడాది మార్చి కల్లా సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.