పుష్ప-2 సినిమాపై మరోసారి స్పందించింది రష్మిక. సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని విషయాలు బయటపెట్టిన ఈ హీరోయిన్, ఈసారి మరింత వివరంగా పుష్ప-2 పై రియాక్ట్ అయింది. షూటింగ్ ప్రతి రోజూ ప్రత్యేకమే అంటోంది.
“సుకుమార్ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వడం కుదరదు. ప్రతి రోజూ ఓ కొత్త అనుభవం. పుష్ప-2 కోసం చాలా సన్నివేశాల్ని లొకేషన్లలో అప్పటికప్పుడు ప్రిపేర్ అయి చేసినవే. ముందుగా సిద్ధమవ్వడం కుదరదు. ప్రతి రోజూ దేనికదే ప్రత్యేకం. ఏరోజుకారోజు ది బెస్ట్ ఇవ్వడమే.”
పుష్ప-2లో ఈసారి మరింత మసాలాతో పాటు డ్రామా చూస్తారని చెబుతోంది రష్మిక. ఎవ్వరూ ఊహించనంత భారీగా సినిమా ఉంటుందని ఊరిస్తోంది.
“పుష్ప-2లో నేను భార్య పాత్ర పోషిస్తున్నాను. ప్రేయసి నుంచి భార్యగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. పుష్పలో నా చుట్టూ ప్రేమ సన్నివేశాలున్నాయి. పుష్ప-2లో మాత్రం నా పాత్ర చుట్టూ చాలా డ్రామా తిరుగుతుంది. పార్ట్-2లో మరింత మసాలా ఉండబోతోంది, దాంతో పాటు చాలా డ్రామా కూడా చూస్తారు.”
పుష్ప-2ను తెలుగుతో పాటు, ఒకేసారి జపాన్ లో కూడా రిలీజ్ చేస్తారట. దీనిపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని తెలిపింది రష్మిక. రీసెంట్ గా సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ పూర్తయిందని, త్వరలోనే మరో సాంగ్ షూటింగ్ లో పాల్గొంటానని స్పష్టం చేసింది.