మలయాళం బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’ సినిమాను తెలుగులోకి వస్తోంది. ఎస్ ఎస్ కార్తికేయ తెలుగులో ఆ సినిమా డబ్బింగ్ పనులు, పంపిణీ పనులు చూస్తున్నారు. మలయాళ నిర్మాతలే తెలుగులో కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రయిలర్ ను వదిలారు. సినిమా ఎలా వుంది అన్నది ఇప్పటికే మలయాళ వెర్షన్ చూసిన వాళ్లకు తెలియాలి.
కానీ కేవలం ఈ ట్రయిలర్ మాత్రమే చూస్తుంటే మాత్రం, వావ్ ఫ్యాక్టర్ అన్నది కనిపించలేదు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో నడిచే మలయాళీ కుర్రాడి ప్రేమ కథ. ఆ నేపథ్యం కేరళ వాళ్లకు కొత్తగా వుండొచ్చు. కానీ మనకు హైదరాబాద్ పాతేగా. అందువల్ల విషయం బాగుండాలి. అదే కీలకం.
మన దగ్గర చాలా యూత్ ఫిల్మ్ లు వచ్చాయి. అవి విడుదల తరువాత ఎలా వున్నా ముందు ట్రయిలర్ వరకు బాగా ఆకట్టుకున్నవే. విడుదల తరువాత కూడా పక్కా కాంటెంపరీ యూత్ ను ఆకట్టుకున్నవే. కానీ ప్రేమలు సినిమా ట్రయిలర్ కాంటెంపరరీ యూత్ కు కూడా అస్సలు పట్టేలా లేదు. సరదా..సరదా సంఘటనలు లేవు..అలా అని ఫీల్ గుడ్ మూవ్ మెంట్స్ లేవు.
నిజానికి మలయాళ సినిమాను యధాతథంగా డబ్ చేసి వదిలేసారు. విడుదల కు సమయం తక్కువ వుండడం వల్ల ఇలా చేసి వుండొచ్చు. మన ప్రేక్షకులకు అలవాటైన ట్రయిలర్ కట్ ఫార్మాట్ వేరు. చిన్న కిక్ వుండాలి. వావ్ ఫ్యాక్టర్ వుండాలి. ఆ రెండూ ప్రస్తుతానికి ఈ ట్రయిలర్ లో అయితే లేవు.