మరి కొన్ని గంటల్లో ధమాకా విడుదల. ఈ మధ్య కాలంలో అన్ని విధాలా బజ్ వచ్చిన సినిమా ఢమాకా. క్రాక్ సినిమా తరువాత ఇప్పటి వరకు రవితేజకు హిట్ లేదు. కాస్త బజ్ వచ్చిన ఖిలాడీ కూడా డిజాస్టరే. కానీ ధమాకా అలాకాదు. పాటలు బ్లాక్ బస్టర్. పబ్లిసిటీ అదిరిపోయంది. శ్రీలీల డ్యాన్స్ లు, లుక్స్ వైరల్ అయ్యాయి.
ఇక మిగిలింది. రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్..కథ..కథనమే. అవి ఏమాత్రం బాగున్నా ధమాకా దూసుకుపోవడానికి గ్రౌండ్ రెడీ గావుంది. డిసెంబర్ మూడో వారం నుంచి పండగ వరకు సరైన సినిమా లేదు థియేటర్లలో. కేవలం నిఖిల్ నటించిన 18 పేజెస్ మాత్రమే పోటీ.
పైగా ఈ సినిమా పక్కా రవితేజ మార్కు సినిమా. ఫన్..ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ అన్నీ కలిసిన సినిమా. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఈవారం ఓ యంగ్ హీరోతో సీనియర్ హీరో పోటీ పడుతున్నట్లే ఒక విధంగా. నిజానికి ధమాకా అన్ని విధాలుగా ముందు వుంది. అందువల్ల ఇది రవితేజకు ఆసిడ్ టెస్ట్. ఇది పాస్ కావాలి. వెనుక మూడు నాలుగు సినిమాలు వున్నాయి. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర రెడీ అవుతున్నాయి. మరి కొన్ని ప్లానింగ్ లో వున్నాయి.
50 కోట్ల నాన్ థియేటర్ మార్కెట్ అన్నది రవితేజకు శ్రీరామరక్షగా వుంది. అది నిలబడాలి అంటే హిట్ పడాలి. ఒక్క హిట్ పడితే చాలు. మళ్లీ కొన్నాళ్లు దూసుకుపోవచ్చు. మరి ఈ టెస్ట్ ను రవితేజ పాస్ అవుతాడా? లేదా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.