ఆ లిస్టులో అల్లు అర్జున్, స‌మంత టాప్!

2021లో ఇండియాలో అత్య‌ధిక సార్లు సెర్చ్ అయిన పేర్ల‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీలు అల్లు అర్జున్, స‌మంత‌లు స్థానం సంపాదించారు. ఈ ఇయ‌ర్ గురించి రివ్యూ చేస్తూ యాహూ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది…

2021లో ఇండియాలో అత్య‌ధిక సార్లు సెర్చ్ అయిన పేర్ల‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీలు అల్లు అర్జున్, స‌మంత‌లు స్థానం సంపాదించారు. ఈ ఇయ‌ర్ గురించి రివ్యూ చేస్తూ యాహూ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అత్య‌ధిక సార్లు సెర్చ్ బార్ లో టైప్ అయిన పేర్ల‌లో అల్లు అర్జున్ పేరు మూడోద‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. మేల్ సెల‌బ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ మూడో స్థానాన్ని సంపాదించాడు. అల్లు అర్జున్ క‌న్నా ముందు వ‌ర‌స‌లో స‌ల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లాలు ఈ జాబితాలో ఉన్నారు. 

సిద్ధార్థ్ శుక్లా హార్ట్ అటాక్ తో మ‌ర‌ణించాడు. చిన్న వ‌య‌సులోనే అత‌డి మ‌ర‌ణం చాలా మందిని విస్మ‌య‌ప‌రిచింది. ఆ న‌టుడి మ‌ర‌ణం పై ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ జ‌రిగింది. ఈ త‌ర‌హాలో అత‌డు టాప్ ప్లేస్ లో నిల‌వ‌డం దురదృష్ట‌క‌ర‌మ‌ని చెప్పాలి. ఇక రెండో స్థానం స‌ల్మాన్ ఖాన్ కు ద‌క్క‌డం పెద్ద ఆశ్చ‌ర్యం లేదు,. మూడో స్థానం రీజ‌న‌ల్ హీరోకి ద‌క్కింది. అల్లు అర్జున్ సినిమాల హిందీ డ‌బ్బింగ్ పై కూడా అక్క‌డ ఆస‌క్తి ఉంది. ఈ నేప‌థ్యంలో.. ఓవ‌రాల్ ఇంట‌ర్నెట్ ట్రెండ్స్ లో అల్లు అర్జున్ పేరు అత్య‌ధికంగా సెర్చ్ అయి ఉండ‌వ‌చ్చు.

ఇక నాలుగో స్థానంలో క‌న్న‌డ దివంగ‌త స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, ఆయ‌న‌తో పాటు అదే స్థానంలో మ‌రో దివంగ‌త న‌టుడు దిలీప్ కుమార్ లు నిలిచారు. ఇక షారూక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచాడు.

ఇక ఫిమేల్ సినీసెల‌బ్రిటీల విష‌యానికి వ‌స్తే.. తొలి స్థానంలో క‌రీనా క‌పూర్, రెండో స్థానంలో క‌త్రినాకైఫ్, మూడో స్థానంలో ప్రియాంక‌, నాలుగో స్థానంలో అలియా భ‌ట్, ఐదో స్థానంలో దీపిక‌లు నిలిచారు. ఈ జాబితాలో ప‌దో స్థానంలో నిలిచి తొలి సారి ఈ లిస్టులోకి ఎక్కింది స‌మంత‌.