ఫ్యామిలీ మేన్ సీజన్-2తో ఓటీటీలోకి ఎంటర్ అవుతోంది సమంత. ఇందులో ఆమె ఉగ్రవాది పాత్రలో కనిపించబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. దీనిపై సమంత కూడా ఎప్పటికప్పుడు గొప్పగా చెబుతూ వచ్చింది. తన కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ ఇదని కూడా చెప్పింది. దీంతో ఈ పాత్రపై అంచనాలు పెరిగాయి.
అలా భారీ అంచనాల మధ్య ఈరోజు ఫ్యామిలీ మేన్ సీజన్-2 ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ చూసిన తర్వాత సమంత చెప్పింది నిజమే అనిపిస్తుంది. తన లుక్ తో అందరికీ షాకిచ్చింది సమంత. రాజీ పాత్రలో ఆమె ఎంత రఫ్ గా, నేచురల్ గా కనిపించాలో సరిగ్గా అలానే కనిపించింది. చూస్తుంటే.. సీజన్-2లో సమంత పాత్రే హైలెట్ అయ్యేలా ఉంది.
సీజన్-2కు సంబంధించి సెటప్ ను ముంబయి నుంచి చెన్నైకి మార్చారు. కథానాయకుడు శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్ పాయ్)ని ఎప్పట్లానే కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా చూపించారు. దీనికితోడు అతడిని ఇంటలిజెన్స్ ఏజెంట్ గా కాకుండా, ఓ సాధారణ ఉద్యోగిగా మరో కంపెనీలో చూపించారు.
చెన్నైలో ఓ టెర్రరిజం కేసును భగ్నం చేసే నేపథ్యంలో సీజన్-2 తెరకెక్కింది. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే (రాజ్ డీకేగా ఫేమస్) తెరకెక్కించిన ఈ సీజన్, జూలై-4 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ కంటెంట్ తో తనకు ఓ సరికొత్త ఇమేజ్ వస్తుందని ఆశిస్తోంది సమంత. ట్రయిలర్ చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది.