చంద్రబాబు ఈ మధ్య ప్రతీ దాని మీద తనదైన పవర్ ఫుల్ డెసిషన్ తీసుకుంటున్నారు. టీడీపీ చరిత్రలో లేని విధంగా బాబు నిర్ణయాలు ఉంటున్నాయని అంటున్నారు.
ఆ మధ్యన పరిషత్తు ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నట్లుగా చెప్పి చంద్రబాబు తమ్ముళ్ళకే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికలలో పాల్గొనకపోతే పార్టీ ఎందుకు రాజకీయాలు ఎందుకు అన్న మాట కూడా నాడు వచ్చింది.
ఇపుడు చూస్తే అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు బాయ్ కాట్ అనేశారు. దీని మీద కూడా సెటైర్లు పడుతున్నాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అయితే జనాలు ఎపుడో బాబుని బాయ్ కాట్ చేశారు. ఇపుడు కొత్తగా ఆయన చేసేదేంటి అంటూ గట్టిగానే పంచ్ లు పేల్చారు.
అయినా బాబు ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా జరిగే నష్టం ఏదీ ఉండదని కూడా గుడివాడ హాట్ కామెంట్స్ చేశారు.
మొత్తానికి చంద్రబాబు నెలల వ్యవధిలో వరసపెట్టి ప్రతీ దానికీ బాయ్ కాట్ అనేస్తున్నారు. ముందు ముందు మరెన్ని బాయ్ కాట్ అస్త్రాలు ప్రయోగిస్తారో అని ఒక చర్చ అయితే పార్టీ లోపలా బయటా నడుస్తోందిట…