ఓదెల 2.. బిజినెస్ క్లోజ్

హిందీ మినహా వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు 9.50 కోట్లకు అమ్మేసారు.

తమన్నా- సంపత్ నంది కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా ఓదెల2. ఈ నెల 17న విడుదల. టీజర్ తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలకు పది రోజులు ముందుగానే పూర్తి బిజినెస్ ను క్లోజ్ చేసుకుంది.

సినిమా తమిళ్ థియేటర్, శాటిలైట్ హక్కులు మిగిలాయి. హిందీ మినహా వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు 9.50 కోట్లకు అమ్మేసారు. నాన్ థియేటర్ మీద 18 కోట్లు ముందుగానే వచ్చాయి. హిందీ వెర్షన్ ను పబ్లిసిటీ ప్లస్ పంపిణీ చేసేందుకు ఇచ్చేసారు. అంటే సినిమా విడుదల ముందు 27.5 కోట్లు రికవరీ అయిపోయింది.

సినిమాకు 27 కోట్ల వరకు ఖర్చయింది. ఇక కాస్త పబ్లిసిటీ ఖర్చు మిగిలింది. నిర్మాత చేతిలో శాటిలైట్, తమిళ్ థియేటర్ హక్కులు వున్నాయి. వాటి మీద, అలాగే హిందీ వెర్షన్ లో ఏమి వచ్చినా లాభమే. ఈ రోజుల్లో ఓ సినిమాకు రిలీజ్ ముందు బిజినెస్ జరగడమే కష్టంగా వుంది. బ్రేక్ ఈవెన్ కావడం ఇంకా కష్టం. లాభాలు రావడం అంటే అబ్బురమే. ఓదెల 2 జస్ట్ కేవలం జానర్, తమన్నా, వదిలిన టీజర్ ఈ మూడూ వర్కవుట్ అయ్యాయి.

ఇంకా విశేషమేమిటంటే సినిమా చూపించి అమ్మడం. నిర్మాత మధు, దర్శకుడు సంపత్ నంది ఈ విషయంలో చాలా వెల్ ప్లాన్డ్ గా వ్యవహరించారు. ప్రయాగ్ రాజ్ లో టీజర్ లాంచ్, ముంబాయిలో ట్రయిలర్ లాంచ్ ఇలా పబ్లిసిటీ విషయంలో కీలకంగా వ్యవహరించి సినిమాకు మంచి బజ్ తెచ్చుకున్నారు. 17న ఓదెల 2 విడుదలవుతోంది. 18న కళ్యాణ్ రామ్-అర్జున్ సన్నాఫ్ వైజయంతి, సారంగపాణి జాతకం విడుదల అవుతున్నాయి.

2 Replies to “ఓదెల 2.. బిజినెస్ క్లోజ్”

Comments are closed.