సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి ఊర‌ట‌

రాజంపేట ఎంపీ, వైసీపీ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ద‌క్కింది.

రాజంపేట ఎంపీ, వైసీపీ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ద‌క్కింది. లిక్క‌ర్ స్కామ్‌లో ఆయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించింది. త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కూ అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని ఏపీ సీఐడీని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించడం విశేషం.

లిక్క‌ర్ స్కామ్‌లో ఏపీ సీఐడీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఏపీ హైకోర్టును మిథున్‌రెడ్డి మొద‌ట ఆశ్ర‌యించారు. అయితే మిథున్‌ను నేర‌స్తుడిగా చేర్చ‌లేద‌ని, అరెస్ట్ అనేదే ఉత్ప‌న్నం కాదంటూ హైకోర్టుకు సీఐడీ చెప్పింది. దీంతో మిథున్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది.

అయితే పార్ల‌మెంట్ స‌మావేశాలకు హాజ‌రైన మిథున్ క‌ద‌లిక‌ల‌పై ఏపీ సీఐడీ ప్ర‌త్యేక నిఘా పెట్టింది. ఈ నెల 4న పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిశాయి. మిథున్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ బృందం ఢిల్లీకి వెళ్లింది. సీఐడీ వ్యూహాన్ని ముందే ప‌సిగ‌ట్టిన మిథున్‌రెడ్డి అప్ర‌మ‌త్తం అయ్యారు.

పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగింపును దృష్టిలో పెట్టుకుని, సీఐడీ త‌న‌ను అదుపులోకి తీసుకునే అవ‌కాశం వుంద‌న్న ఆలోచ‌న‌తో మిథున్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే వైసీపీ పార్ల‌మెంట్ స‌భ్యుల వెంట ఉన్న వాళ్ల‌పై సీఐడీ టీమ్ నిఘా పెట్టింది. మిథున్‌రెడ్డిని వైసీపీ ఎంపీలు ఎక్క‌డో ర‌హ‌స్యంగా క‌లుస్తార‌నే అనుమానంతో సీఐడీ టీమ్, ఆ దిశ‌గా పావులు క‌దిపింది.

అయితే ఇవాళ సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌గ‌డం, మ‌ధ్యంత‌ర ఉప‌శ‌మ‌నం పొంద‌డంతో వైసీపీ నేత ఊపిరి పీల్చుకున్నారు. మిథున్‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కూడా కేసులో ఇరికించాల‌ని ప్ర‌భుత్వం భావించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సుప్రీంకోర్టులో ఊర‌ట ద‌క్క‌డంతో ప్ర‌భుత్వ ప‌న్నాగాలు పార‌లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

7 Replies to “సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి ఊర‌ట‌”

  1. ఈ GA గాడు రెపు CID తీగలాగితె డొంక అంతా కదులుద్ది అని డిసైడ్ అయినట్టు ఉన్నాడు!

    అందుకె ప్రతిసారి… మిదున్ రెడ్డి అర్రెస్త్ చెయటం ద్వరా జగన్ ని కూడా ఇరికిద్దాం అని చూస్తున్నారు అని ముందె రాస్తున్నడు.

  2. ఇరికించటం ఏంటిరా వీళ్ళ మొహాలు చేస్తుంటే అర్థం కావటం లేదా? అసలు వీళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు?? courts should not give bail to these criminals!!

  3. ఇరికించటం ఏంటిరా వీళ్ళ మొహాలు చేస్తుంటే అర్థం కావటం లేదా? అసలు వీళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు?? courts should not give bail to these cri*min*als!!

  4. ఇరికించటం ఏంటిరా వీళ్ళ మొహాలు చేస్తుంటే అర్థం కావటం లేదా? అసలు వీళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు?? co*urts should not give b*ail to these cri*min*als!!

  5. ఇరికించటం ఏంటిరా వీళ్ళ మొహాలు చేస్తుంటే అర్థం కావటం లేదా? ఏమి తప్పు చేయకపోతే అసలు వీళ్ళు ఎందుకు దాక్కుంటున్నారు??

Comments are closed.