డిప్యూటీ క‌లెక్ట‌ర్ దుర్మ‌ర‌ణం

నిత్యం త‌మ‌తో క‌లిసి వుండే డిప్యూటీ క‌లెక్ట‌ర్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయింద‌నే వాస్త‌వాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

రోడ్డు ప్ర‌మాదంలో హంద్రీ-నీవా డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మాదేవి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ దుర్ఘ‌ట‌న అన్న‌మ‌య్య జిల్లా సంబేప‌ల్లి మండ‌లంలోని య‌ర్ర‌గుంట్ల వ‌ద్ద చోటు చేసుకుంది.

పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. పీలేరు నుంచి రాయచోటి క‌లెక్ట‌రేట్‌కు కారులో డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మాదేవి బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్యంలో ఎదురెదురుగా రెండు కార్లు ఢీకున్నాయి. డిప్యూటీ క‌లెక్ట‌ర్‌తో పాటు మ‌రో నలుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు క్ష‌త‌గాత్రుల్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ర‌మాదేవి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన న‌లుగురు వైద్యం పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఉద్యోగులు శోక‌సంధ్రంలో మునిగారు.

నిత్యం త‌మ‌తో క‌లిసి వుండే డిప్యూటీ క‌లెక్ట‌ర్ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయింద‌నే వాస్త‌వాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

5 Replies to “డిప్యూటీ క‌లెక్ట‌ర్ దుర్మ‌ర‌ణం”

  1. మన తెలుగు D0 న్ G@ల పార్టీ అభిమానులు … S@డి స్టులు అయిపోయి.. చివరకు.. కలెక్టర్ దుర్మరణం అయ్యింది అన్న వార్తకు కూడా.. 57% మంది HAPPY emoji ని 9% మంది Excited emoji క్లిక్ చేశారేంటి ర… B0 గ్ మ్ వెధవల్లార!?

  2. ఆ డామేజ్ ని బట్టి చూస్తే సీట్ బెల్ట్ వాడలేదని తెలుస్తుంది. ఒక డిప్యూటీ కలెక్టర్ గా ఉండి కూడా సీటు బెల్ట్ వాడకపోతే ఎలాగమ్మా?

Comments are closed.