నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల వైసీపీ కన్వీనర్ ఇందూరి ప్రతాప్‌రెడ్డికి ప్రాణాపాయం తప్పింది. రెండు రోజుల క్రితం సిరివెళ్ల మండలంలోని స్వగ్రామమైన గోవిందపల్లెలో టీడీపీ రౌడీలు ప్రతాప్‌రెడ్డిపై మారణాయుధాలతో హత్యాయత్నం చేశాయి. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటిన నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే తలలో మెదడు బాగానికి దెబ్బ తగలకపోవడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రతాప్‌రెడ్డి అన్న ప్రభాకర్‌రెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ప్రతాప్‌రెడ్డితో నిందితులు రాజీకి ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే రాజీకి ప్రతాప్‌రెడ్డి అంగీకరించకపోవడంతో , భౌతికంగా అంతమొందించాలని ప్రయత్నించినట్టు తెలిసింది. తాజాగా ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఐదుగురు టీడీపీ రౌడీలపై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం గోవిందపల్లెలో తుపాను ముందరి ప్రశాంతత నెలకుంది. గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. అధికారంలో లేని వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉన్నాయి. భవిష్యత్‌లో గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.
జాయిన్ కావాలి అంటే ప్రొఫైల్ ఓపెన్