పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెళ్లినా… టీడీపీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకుంటారా? అంటే , ఔననే సమాధానం వస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలను గౌరవించి పవన్‌కల్యాణ్‌ను గెలిపించుకున్నామని, ఇప్పుడు ఆయన రూపంలో తమకు అవమానం ఎదురవుతోందని వాపోతున్నారు. ఇటీవల పవన్‌కల్యాణ్ సొంత అన్న, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురానికి వెళ్లారు. రెండురోజుల పాటు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
అయితే తమ నాయకుడైన టీడీపీ ఇన్‌చార్జ్ వర్మను కనీసం ఆహ్వానించలేదంటూ ఆ పార్టీ శ్రేణులు నాగబాబును అడ్డుకున్నాయి. దీంతో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. కేవలం నాగబాబుతోనే పిఠాపురంలో అసంతృప్తి పోతుందని అనుకుంటే పొరపాటే అని ఇరుపార్టీల నాయకులు అంటున్నారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిఠాపురానికి వెళ్లి, ఇదే రీతిలో వర్మను ఆహ్వానించకపోతే తప్పకుండా చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వుంటుందని టీడీపీ కార్యకర్తలు, నాయకులు హెచ్చరిస్తున్నారు. నాగబాబు వెనుక పవన్‌కల్యాణ్ ఉన్నారని, ఆయనకు తెలియకుండా వర్మను అవమానించేలా వ్యవహరించే పరిస్థితి వుండదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
వర్మ తీరుపై ముఖ్యంగా పవన్‌కల్యాణే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా తన మద్దతు లేకపోతే, పవన్ గెలవలేరనే లెక్కలేనితనంతో వర్మ వ్యవహరిస్తున్నారని జనసేన స్థానిక నాయకులు మోసినట్టు సమాచారం. ఇది కాస్త చినికిచినికి గాలివానగా మారిన చందంగా, పిఠాపురంలోనే జనసేన, టీడీపీ మధ్య గొడవలకు దారి తీయడం చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో పవన్‌కల్యాణ్ పిఠాపురం వెళితే ఎలా వుంటుందో అనే ఉత్కంఠ మాత్రం రెండు పార్టీల్లోనూ వుంది.
ఈ మెగా ఫ్యామిలి ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు సహజం, అది సినిమా ఫీల్డ్ అయినా, వాళ్ళ నియోజకవర్గం అయినా. ఇలాంటి గొడవలు వేరే ఎక్కడా ఉండవు. వీళ్లకి తోడు వీళ్ళ చిల్లర ఫ్యాన్స్.
అప్పిడియా!:)
Jaglak Family vunna chotalla criminal panule
రోజుకి నాలుగు సార్లు పిఠాపురంలో పవన్, వర్మ ఎదురైతే అర్జునుడు, కర్ణుడు లాగ కురుక్షేత్ర సంగ్రామమే…. ఈ దెబ్బతో కూటమి కుదేలు అని మీ ఆశలు, కలలు అన్నీ నిరుపయోగం ….కూటమి దెబ్బతినాలి అంటే అగ్ర నాయకత్వం మధ్య గొడవలు రావాలి….. వర్మ గారు కేవలం నియోజిక వర్గ స్థాయి నాయకుడు…..
పిఠాపురం ఇంచార్జి గా GA అయితే బెస్ట్.. రియలటైం మానిటరింగ్.. RTGS కూడా దీని ముందు తక్కువే
జాయిన్ కావాలి అంటే