హీరోయిన్ సమంత స్కిన్ ప్రోబ్లమ్ మీద టాలీవుడ్ లో అనేక గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి, కొన్ని మందులు పడకపోవడం వల్ల స్కిన్ రాష్ సమస్య వచ్చిందని, ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఇలా రకరకాలుగా వినిపిస్తోంది.
ఏవీ అధికారికంగా ధృవీకరించనూ లేదు. ఖండించనూ లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే సమంత ప్రస్తుతం సైలంట్ గా వున్నట్లే లెక్క. యశోద టీజర్ కు సంబంధించి తప్ప ముందు వెనుక మరో పోస్ట్ లేదు.
ఇదిలా వుంటే సమంత రాకపోవడం వల్ల ఖుషీ సినిమా విడుదల వాయిదా పడే సూచనలు వున్నాయని క్లారిటీగా తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కావాల్సి వుంది. కానీ ఇంకా ముఫై రోజులకు పైగానే షూటింగ్ వర్క్ వుందని తెలుస్తోంది.
అక్టోబర్ నుంచి సమంత వచ్చినా డిసెంబర్ డేట్ ను మీట్ కావడానికి కొంచెం అవకాశం వుంది. కానీ అలా కాకపోవచ్చని, ప్రీ సమ్మర్ కు ఖుషీ వాయిదా పడే అవకాశాలు వున్నాయని వినిపిస్తోంది.
దీనికి తోడు ఖుషీ సినిమా పక్కా సాఫ్ట్ సబ్జెక్ట్. ఫైట్ లు వగైరా ఏమీ వుండవు. కానీ హిందీ రైట్స్ వగైరా విషయాలు దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారని మరో టాక్ వినిపిస్తోంది.
అందువల్ల మొత్తం మీద డిసెంబర్ బరిలోకి ఖుషీ దిగడం కష్టమే అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సమంత కనుక క్లారిటీ ఇచ్చి త్వరగా సెట్ మీదకు వస్తే అప్పుడు అన్నీ సెట్ రైట్ కావచ్చు.