ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైప్ కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా శృతిహాసన్ కూడా చేరింది.
సలార్ లో హీరోయిన్ కోసం శృతిహాసన్ ను కూడా సంప్రదించారని ఆమె క్లోజ్ సర్కిల్ చెబుతోంది. ఈ మేరకు ఓ పాపులర్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
ప్రభాస్-శృతిహాసన్ కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. కాబట్టి స్క్రీన్ పై వీళ్లిద్దరి పెయిర్ ఫ్రెష్ గా ఉంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. దీనికితోడు ఈ పాత్రను శృతిహాసన్ ఇప్పటివరకు టచ్ చేయలేదంట. అందుకే ఆమెను తీసుకోవాలని ప్రశాంత్ అనుకుంటున్నాడు.
శృతిహాసన్ కు ఇప్పటికే సలార్ నెరేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సినిమాలో ఆమె కనిపించే సమయం తక్కువే ఉన్నప్పటికీ, అది పవర్ ఫుల్ రోల్. అయితే శృతిహాసన్ మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఎందుకంటే, ఆమె ఆల్రెడీ ఓ బాలీవుడ్ సినిమాకు, మరో తమిళ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది. హిందీ సినిమాతో సలార్ కు క్లాష్ అయ్యేలా ఉంది. ఆ క్లారిటీ వస్తే ఆమె సలార్ పై ఓ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. మొత్తమ్మీద సలార్ హీరోయిన్ వ్యవహారం కత్రినాకైఫ్ నుంచి శృతిహాసన్ వరకు వచ్చింది. ఇంకెంతమంది పేర్లు ఈ లిస్ట్ లో వినిపిస్తాయో!