సైమా గెస్ట్ చిరు

టాలీవుడ్ నుంచి టాప్ గెస్ట్ అంటే ఎవరు? మెగాస్టార్ మినహా? అందుకే సైమా అవార్డుల ఫంక్షన్ కు ఈసారి మెగాస్టార్ చిరంజీవినే చీఫ్ గెస్ట్. ఖతర్ లో ఈనెల 15, 16న జరిగే సైమా…

టాలీవుడ్ నుంచి టాప్ గెస్ట్ అంటే ఎవరు? మెగాస్టార్ మినహా? అందుకే సైమా అవార్డుల ఫంక్షన్ కు ఈసారి మెగాస్టార్ చిరంజీవినే చీఫ్ గెస్ట్. ఖతర్ లో ఈనెల 15, 16న జరిగే సైమా అవార్డుల ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నారు. కేవలం తెలుగు సినిమాల సెషన్ కు మాత్రమేకాదు. కన్నడ సినిమాల సెషన్ కు కూడా ఆయనే చీఫ్ గెస్ట్.

తమిళ, మలయాళ సినిమాల సెషన్ కు సూపర్ స్టార్ మోహన్ లాల్ చీఫ్ గెస్ట్ వ్యవహరించనున్నాడు. ఈసారి సైమా అవార్డులకు కాస్త ఆసక్తి వుంది. ఎందుకంటే ఎన్నో పాపులర్ సినిమాలు, పేరు తెచ్చుకున్న సినిమాలు బరిలో వున్నాయి. అందువల్ల ఎంతమందో హీరోలు, దర్శకులు, టెక్నీషియన్లు పోటీలో వున్నారు. మరి అవార్డులు ఎవరిని వరిస్తాయో చూడాలి.

నంది అవార్డులు ఎప్పడో ఆగిపోయాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్ర ప్రభుత్వం వాటిని పట్టించుకున్నట్లు లేదు. చిన్నా చితగా ప్రయివేటు అవార్డులు ఆసక్తిగా వుండడంలేదు. ఇలాంటి నేపథ్యంలో సైమా అవార్డుల పంక్షన్ కాస్త గ్లామరస్ గా, గ్రాండియర్ గా వుండడంతో, క్రేజ్ వచ్చింది. ఈసారి ఈ ఉత్సవం ఖతర్ లో జరగనుంది.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!