కొత్త ఏడాదిలో తొలి సెలబ్రిటీ వివాహం నమోదైంది. స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఆష్నా ష్రాఫ్ ను వివాహం చేసుకున్నట్టు స్వయంగా ప్రకటించాడు ఈ గాయకుడు. ఈ మేరకు కొన్ని ఫొటోలు కూడా విడుదల చేశాడు.
పెళ్లికి సరిగ్గా కొన్ని రోజుల పాటు ఐఐటీ బాంబే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కన్సర్ట్ లో పాల్గొన్నాడు అర్మాన్. తన పాటలతో అందర్నీ ఉర్రూతలూగించాడు. ఆ వెంటనే నేరుగా వెళ్లి పెళ్లి వేడుకల్లో జాయిన్ అయ్యాడు.
దాదాపు ఐదేళ్లుగా అర్మాన్-ఆష్నా ప్రేమించుకుంటున్నారు. గతేడాది ఆగస్ట్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇకపై నువ్వే నా ఇల్లు అంటూ అర్మాన్ క్యాప్షన్ పెట్టి మరీ ఫొటోలు షేర్ చేశాడు.
అర్మాన్ మాలిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అద్భుతమైన వాయిస్ తో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. ఎంతటి కష్టమైన పాటనైనా అలవోకగా ఆలపిస్తాడనే ఇమేజ్ ఉంది. ఇక ఆష్నా ఓ ప్రముఖ యూట్యూబర్. ఫ్యాషన్, బ్యూటీకి సంబంధించి వీడియోస్ చేస్తుంది. లగ్జరీ ఫ్యాషన్ ఇన్ ఫ్ల్యూయన్సర్ గా ఆమె 2023లో అవార్డ్ కూడా అందుకుంది.
Happy married life