పవన్ మౌనం.. అదే మాకు సాయం

సైలెన్స్ అనేది చాలా చెబుతుంది. అటు వైపు నుంచి వాళ్లు సైలెంట్ గా ఉండడం నాకు చాలా తెలిసొచ్చింది.

జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు, జనసేన పార్టీలో సభ్యుడు కూడా. అలాంటి వ్యక్తిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినప్పుడు పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాజకీయ కార్యకలాపాల నుంచి అతడ్ని దూరం చేస్తూ ప్రెస్ నోట్ మాత్రం బయటకొచ్చింది.

ఇంతకీ జానీ మాస్టర్ అరెస్ట్ అయినప్పుడు పవన్ నుంచి మద్దతు వచ్చిందా లేదా? పవన్ కల్యాణ్ నుంచి మద్దతు రాలేదన్నాడు జానీ మాస్టర్. అయితే పవన్ మౌనం తనకు హెల్ప్ చేసిందన్నాడు.

“సైలెన్స్ అనేది చాలా చెబుతుంది. అటు వైపు నుంచి వాళ్లు సైలెంట్ గా ఉండడం నాకు చాలా తెలిసొచ్చింది. నిజంగా నేను తప్పు చేసినట్టయితే ఓపెన్ గా చెప్పేవారు కదా. నాపై నమ్మకం ఉంది కాబట్టే వాళ్లు సైలెంట్ గా ఉన్నారు. నాగబాబు నాకు బహిరంగంగా మద్దతిచ్చారు. నాకు సపోర్ట్ ఇస్తేనే పవన్ కల్యాణ్ కు జై కొట్టను. నాకు సాంగ్స్ ఇస్తేనే రామ్ చరణ్ కు జిందాబాద్ అనే వ్యక్తిని కాదు నేను. నా మనసులో వాళ్ల మీద ప్రేమ ఉంది, ఎప్పటికీ ఆ ప్రేమ అలానే ఉంటుంది.”

పార్టీ కార్యకలాపాలకు తనను దూరం చేయడంపై ఎలాంటి బాధ లేదన్నాడు జానీ మాస్టర్. పవన్ కల్యాణ్ ఆ నిర్ణయం తీసుకోవడం తనకు సమ్మతమేనని, పవన్ స్థానంలో తను ఉన్నా అలాంటి నిర్ణయమే తీసుకుంటానని అన్నాడు.

4 Replies to “పవన్ మౌనం.. అదే మాకు సాయం”

Comments are closed.