విశ్వం ట్రయిలర్.. శ్రీనువైట్ల మారలేదు

దర్శకుడు శ్రీను వైట్లకు ఓ స్టయిల్ వుంది. చాలాకాలం తరువాత గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా నిర్మాణం. దసరా కు థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల…

దర్శకుడు శ్రీను వైట్లకు ఓ స్టయిల్ వుంది. చాలాకాలం తరువాత గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా నిర్మాణం. దసరా కు థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. ట్రయిలర్ కలర్ ఫుల్ గా, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో వుంది. దేశాన్ని ఏదో చేయాలనుకునే విలన్. కాపాడాలనుకునే హీరో. మధ్యలో ఓ కన్ఫ్యూజ‌న్ కామెడీ. దాని కోసం బోలెడు మంది కమెడియన్లు. హీరోయిన్ తో కలర్ ఫుల్ డ్యూయట్ లు, రొమాన్స్ దీనికి బోనస్. ట్రయిలర్ లో కనిపించింది ఇదే.

శ్రీనువైట్ల మార్కు ఫన్ సీన్లు మరోసారి కనిపించాయి. అతని మార్కు సెటైర్ డైలాగులు పడ్డాయి. నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్, రెడ్ బుక్ వంటి కాంటెంపరరీ సెటైర్లు వున్నాయి. చిత్రీకరణ భారీగా వుంది. మంచి మంచి లొకేషన్లు ట్రయిలర్ లో కనిపించాయి. మొత్తం మీద ఫార్మాట్ రెగ్యులర్, స్టోరీ లైన్ రెగ్యులర్. కానీ దీనికి థియేటర్లో అస్సలు కన్ను తిప్పకుండా చూసేలా శ్రీను వైట్ల ఏం చేయబోతున్నారన్నది క్వశ్చన్ మార్క్.

గోపీచంద్ ఎప్పటిలాగే వున్నాడు. గెటప్ మారలేదు డైలాగు డెలివరీ మారలేదు. మిగిలినవన్నీ కూడా మారలేదు. కొత్తగా ట్రయ్ చేయడం అన్న దానికి గోపీచంద్ చాలా దూరంగా వుంటారు అని ఈ ట్రయిలర్ మరోసారి చెప్పింది. థియేటర్లో నవ్వులు పూయించగలిగితే శ్రీనువైట్ల బ్యాక్ అనుకోవచ్చు.

10 Replies to “విశ్వం ట్రయిలర్.. శ్రీనువైట్ల మారలేదు”

  1. విజయవాడ వరద ఖర్చుల్లో భారీ అవినీతి: 534కోట్ల.

    ఒక్కో భోజనానికి రూ.264

    కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లుగా ప్రభుత్వం రాసేసింది. వరద బాధితులకు భోజనం కోసం ఏకంగా రూ.368కోట్లుగా సర్కార్ లెక్క చెప్పింది. ఒక్కో భోజనానికి రూ.264 ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించారు.

    రూ.534కోట్లలో ఆహారం, నీళ్లు, వసతి, పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే, వరదల సందర్భంగా తమకు 10 రోజుల పాటు ఆహారం, నీళ్లు అందక బాధితులు గగ్గోలు పెట్టారు.

  2. రోటిన్ రోట్టా కామెడీ తప్పా…. ఏం లేదు….

    గోపి చంద్ ఏం చేసినా గోపి చంద్ మాత్రమే కనిపిస్తాడు… నటించిన పాత్ర కనపడదు అదేంటో….

    ఇక శీను వైట్ల దర్శకత్వం మారుతుంది అనుకోవడం అత్యాశే అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే….

Comments are closed.