గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ మాల్దీవులు. భూతలంపై ఉన్న అద్భుత ప్రదేశాల్లో ఒకటైన మాల్దీవులకు భారతీయ సెలబ్రిటీలు అయితే క్యూ కడుతూ ఉన్నారు.
చోటా, బడా తేడా లేకుండా.. హీరోయిన్లు మాల్దీవులకు వెళ్లి అక్కడ అందమైన లొకేషన్లలో ఫొటోలు దిగి పోస్టు చేయడం రొటీన్ గా మారింది. ఈ నటీమణులకు ఫాలోయర్లను పెంచుకోవడానికి కూడా ఇదొక చక్కటి మార్గంగా కూడా మారినట్టుగా ఉంది.
ఈ క్రమంలో మాల్దీవుల్లో విహారం ద్వారా తన ఫాలోయర్లను పలకరించింది తమన్నా భాటియా. తను మాల్దీవులకు వెళ్లడం ఇదే తొలి సారి అని కూడా ఈ బ్యూటీ చెబుతోంది. ఈ ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ తనకు బెస్ట్ ఫీలింగ్ ను ఇస్తోందని కూడా తమన్నా చెబుతోంది.
తనను రిసీవ్ చేసుకున్న స్టాఫ్ కూడా తననొక క్వీన్ లా చూసుకుంటోందని తమన్నా గర్వంగా చెబుతోంది. వారి ఆతిథ్యం అద్భుతంగా ఉందని వివరిస్తోంది. మాల్దీవుల తీరాల్లో అలల నుంచి ఆనందం కొట్టుకు వస్తున్నట్టుగా తమన్నా చెబుతోంది. ఇది తనకు ఒక జీవిత కాలపు అనుభూతి అని అంటోంది.