ఆలియా…ఎన్టీఆర్..పాన్ ఇండియా

ఆర్ఆర్ఆర్ రిజ‌ల్ట్ అద్భుతంగా వుందని ప్రచారాలు ఓ పక్క సాగుతున్నాయి. అదే టైమ్ లో నార్త్ లో ఎన్టీఆర్ కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చరణ్ పాత్రను రాముడిగా ప్రెజెంట్…

ఆర్ఆర్ఆర్ రిజ‌ల్ట్ అద్భుతంగా వుందని ప్రచారాలు ఓ పక్క సాగుతున్నాయి. అదే టైమ్ లో నార్త్ లో ఎన్టీఆర్ కు రావాల్సినంత క్రేజ్ రాలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చరణ్ పాత్రను రాముడిగా ప్రెజెంట్ చేయడంతో వ్యవహారం అంతా అటు మళ్లిపోయింది. 

సరే, ఈ విషయం ఇలా వుంటే బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ తన సోషల్ మీడియా అక్కౌంట్ లో దర్శకుడు రాజ‌మౌళిని అన్ ఫాలో చేసిందన్న వార్త ఈ ఉదయం నుంచి గుప్పుమంది. అంతే కాదు. చాలా వరకు ఆర్ఆర్ఆర్ ఫొటోలు తన అక్కౌంట్ నుంచి తొలగించిందనే వార్త కూడా కొసరుగా వినిపించింది.

అల్లూరి సీతారామరాజు సినిమాలో సీతగా విజ‌యనిర్మల పాత్ర పరిమితమే. ఆర్ఆర్ఆర్ లో కూడా అంతే. కానీ మరి ఈ విషయం ఆలియాకు ముందే చెప్పలేదో? లేక తీసిన సీన్లు తీసేసారో? మొత్తం మీద ఆలియా అలిగినట్లుంది. డబ్బింగ్ కూడా చెప్పలేదని వేరే ఆర్టిస్ట్ చేత చెప్పించారని బోగట్టా. సెకెండ్ రౌండ్ పబ్లిసిటీలో కూడా ఆలియా కనిపించలేదు. మొత్తం మీద ఏదో జ‌రిగింది.

ఇలాంటి నేపథ్యంలో ఆలియాభట్ మరో తెలుగు సినిమాకు ఓకె అంటుందా? అన్నది చూడాలి. ఎన్టీఆర్ సరసన చేయబోతున్నట్లు ఆమెనే గతంలో వెల్లడించింది. పైగా పాన్ ఇండియా సినిమా అయితేనే ఆలియాను తీసుకుంటారు. లేదూ కేవలం తెలుగు మాత్రమే అంటే అంత రెమ్యూనిరేషన్ వృధా అవుతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేస్తారా? లేక కేవలం తెలుగు సినిమానే చేస్తారా? అన్నది చూడాలి.

భీమ్లా నాయక్ సినిమాను హిందీలో విడుదల చేస్తామని, మెల్లిగా ఆ విషయం స్కిప్ చేసారు. అన్ని సినిమాలకు హిందీ మార్కెట్ రాదు. రవితేజ‌ ఖిలాడీ హిందీలో వాష్ అవుట్ అయింది. అందువల్ల సరైన పాన్ ఇండియా ఇమేజ్ వున్న డైరక్టర్ సెట్ కాకపోతే, ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా చేసే ధైర్యం చేయకపోవచ్చు.