Advertisement

Advertisement


Home > Movies - Press Releases

సూప‌ర్ఉమెన్ మూవీ `ఇంద్రాణి`

సూప‌ర్ఉమెన్ మూవీ `ఇంద్రాణి`

మొద‌టిసారి సూప‌ర్‌గ‌ర్ల్ క‌థాంశంతో విజువ‌ల్ వండ‌ర్‌గా రాబోతున్న చిత్రం `ఇంద్రాణి`. వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న‌ ఈ  చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ సింగ్, ఫ్ర‌ణిత జిజిన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

ఇంద్రాణి మూవీ హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి న‌రేష్ విజ‌య‌కృష్ణ క్లాప్ కొట్ట‌గా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఇంద్రాణి మోష‌న్‌పోస్ట‌ర్‌ను తుంబాడ్(హింది) ద‌ర్శ‌కుడు రాహి అనిల్ బార్వే విడుద‌ల చేశారు.

రాహి అనిల్ బార్వే మాట్లాడుతూ - ``రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి? చాలా గ్రాండ్‌గా విజువల్ వర్క్ ఎలా జరగాలి అనేదానిపై ఓ అంచనాకు వచ్చి చేస్తున్న చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా టీమ్ అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీం అందరికీ అల్ ద బెస్ట్`` అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ -  ``మన సినిమా ఇండస్ట్రీకు కూడా సూపర్ బాయ్, సూపర్ ఉమెన్, సూపర్ విలన్ లు రావాలి. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌కుండా ఒక విభిన్న చిత్రం చేస్తున్న మా స్టీఫెన్‌, స్టాన్లీకి కంగ్రాచ్యులేష‌న్స్‌..అవేంజర్స్‌లా ఈ సినిమా తీయాల‌ని కోరుకుంటూ టీం అందరికీ అల్ ద బెస్ట్`` అన్నారు.

యానియా భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ - `ఇంద్రాణి పాత్రే న‌న్ను సెల‌క్ట్ చేసుకుంది. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. త‌ప్ప‌కుండా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు స్టీఫెన్‌ మాట్లాడుతూ -  ``ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. చిన్నపిల్లలందరికి ఇండియాలో సూపర్ హీరో లేరు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న పక్కా మాస్ మార్వెల్ సినిమా. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఉంటాయి. యానియా భ‌ర‌ద్వాజ్ ప్రోఫైల్ స‌రిగ్గా స‌రిపోవ‌డంతో లీడ్ క్యారెక్ట‌ర్‌కు ఆమెను సెల‌క్ట్ చేసుకోవ‌డం జ‌రిగింది. ఈ సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ తీసుకుంది. యామిని యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌కుండా అల‌రిస్తాయి`` అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?