చైతూను పడేయడం కోసమే జిమ్ చేశా – సమంత

సమంతకు ఎప్పట్నుంచి ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరిగింది. ఆమె ఫస్ట్ టైమ్ ఎప్పుడు కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది సమంత.  Advertisement నాగచైతన్యను కలిసేందుకు, అతడ్ని ఆకర్షించేందుకు తను…

సమంతకు ఎప్పట్నుంచి ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరిగింది. ఆమె ఫస్ట్ టైమ్ ఎప్పుడు కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది సమంత. 

నాగచైతన్యను కలిసేందుకు, అతడ్ని ఆకర్షించేందుకు తను కూడా తొలిసారి జిమ్ లో జాయిన్ అయినట్టు వెల్లడించింది సమంత. వీటితో పాటు మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

– మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి?

ఓ బేబీ, ది ఫ్యామిలీ మేన్ పాత్రలంటే చాలా ఇష్టం. వీటిలో ఏదో ఒకటి చెప్పమంటే కష్టం.

– చాన్నాళ్ల తర్వాత చెన్నై వెళ్లడం ఎలా అనిపించింది?

లాక్ డౌన్ టైమ్ లో చెన్నైని బాగా మిస్ అయ్యాను. ఈమధ్యే వెళ్లి వచ్చాను. పేరెంట్స్, ఫ్రెండ్స్ ను కలిశాను. చాలా రోజుల తర్వాత చెన్నైలో షూట్ చేయడం, తమిళ్ లో మాట్లాడ్డం బాగా అనిపించింది.

– మీ టాప్-3 ఫేవరెట్ బుక్స్?

ఆస్ట్రిక్స్ అండ్ ఆబ్లిక్స్, శాంతారామ్, మహాభారత

– నాగచైతన్య ఎందుకు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడు?

నాగచైతన్య ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడని అందరూ అడుగుతున్నారు. నేను కూడా నాగచైతన్యను అదే అడుగుతున్నాను. చెప్పు చైతన్య.. ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించవు?

– ట్రోల్స్ ను ఎలా ట్రీట్ చేస్తారు?

ట్రోలింగ్స్ కు ఒకప్పుడు భయపడేదాన్ని. రాత్రిళ్లు నిద్రపట్టేది కూడా కాదు. కానీ ఇప్పుడు నాపై వస్తున్న ట్రోలింగ్స్ చూస్తే నవ్వొస్తుంది. అవి నాపై ఎలాంటి ప్రభావం చూపించవు. ఓ వ్యక్తిగా నేను ఎదిగాననే విషయం అర్థమౌతోంది.

– ఎప్పట్నుంచి జిమ్ స్టార్ట్ చేశారు?

ఓ పెద్ద సీక్రెట్ చెప్పబోతున్నాను. నేను ఎందుకు జిమ్ స్టార్ట్ చేశానో తెలుసా..? నాగచైతన్యను పడేయడం కోసమే. చైతూ ఎప్పుడూ జిమ్ లోనే గడుపుతాడు. అందుకే నేను కూడా ఫస్ట్ టైమ్ జిమ్ లో జాయిన్ అయ్యాను.

– మీమ్స్, వీడియోస్ లో  ఏదిష్టం?

మీమ్స్ ఎప్పటికప్పుడు వాడుతుంటాను. ఇక వీడియోస్ విషయానికొస్తే.. కుక్కలకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం.

– 2021 నిర్ణయాలు?

శాకాహారిగానే కొనసాగాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తింటాను. రోజూ యోగా, మెడిటేషన్ చేయాలి. ప్రతి రోజూ ఆనందంగా ఉండాలి.

– 2020లో బెస్ట్ మెమొరీ?

రానా పెళ్లి చేసుకోవడం. .. ఆ పెళ్లిలో భాగం అవ్వడం.

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌