త్రివిక్రమ్ వస్తున్నారా..’బ్రో’!

పవన్ కళ్యాణ్ సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజి, ఈ నాలుగూ దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసినవే. వకీల్ సాబ్ కేవలం సెట్ చేయడం వరకే. భీమ్లా నాయక్ కు అన్ని…

పవన్ కళ్యాణ్ సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజి, ఈ నాలుగూ దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసినవే. వకీల్ సాబ్ కేవలం సెట్ చేయడం వరకే. భీమ్లా నాయక్ కు అన్ని విధాలా కష్టపడ్డారు. బ్రో సినిమాకు కథ మార్పులు, మాటలు అందించారు. ఓజి కి కేవలం సైలంట్ వాటాదారు మాత్రమే అన్నది తెరవెనుక టాక్. 

పవన్ సినిమాల విషయంలో ఇంత కీలకంగా వుండే త్రివిక్రమ్ ఈ రోజు జరిగే బ్రో సినిమా ఫంక్షన్ కు వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్..త్రివిక్రమ్ ఓ స్టేజ్ మీద వుంటే ఆ అందమే వేరు. పైగా పవన్ రావాలి అంటే పక్కన త్రివిక్రమ్ వుండాల్సిందే అనే అభిప్రాయం ఇండస్ట్రీలో వుంది. యూనిట్ వర్గాల బోగట్టా ప్రకారం త్రివిక్రమ్ వస్తాననే మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. 

బ్రో సినిమాను సెట్ చేసింది, దానికి తానే పూనుకుని మార్పులు చేర్పులు చేసింది, మాటలు అందించింది కనుక త్రివిక్రమ్ వస్తారనే భావించాలి. పైగా అనధికార సమాచారం ప్రకారం ఈ సినిమాకు త్రివిక్రమ్ 15 కోట్లు రెమ్యూనిరేషన్, పావలా వాటా తీసుకున్నారని వినిపిస్తూనే వుంది.

అందువల్ల సినిమాకు మరింత బజ్ తేవాల్సిన బాధ్యత కూడా అంతో ఇంతో త్రివిక్రమ్ మీద వుంది. అందువల్ల ఆయన కచ్చితంగా హాజరు కావచ్చు. పైగా బ్రో సినిమా మాస్ మసాలా సినిమా కాదు. జీవితం.. విలువ.. ఫిలాసఫీ.. కుటుంబ విలువలు ఇవన్నీ కలిసి మంచి సినిమా. ఇలాంటి సినిమా గురించి జనాల్లో సరైన మాటలు ఇంజెక్ట్ చేయాల్సి వుంది. అది కేవలం త్రివిక్రమ్ వల్లనే సాధ్యం.

బ్రో సినిమాను పీపుల్స్ మీడియా సంస్థ బ్యానర్ మీద విశ్వప్రసాద్, వివేక్ నిర్మించారు. సముద్రఖని దర్శకుడు.