మాజీ పోలీస్ సెట్స్ పైకి వచ్చాడు

ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ చుట్టూ తిరిగే కథతో అనీల్ రావిపూడి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్స్ కాప్ గా వెంకటేశ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా…

ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ చుట్టూ తిరిగే కథతో అనీల్ రావిపూడి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్స్ కాప్ గా వెంకటేశ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి, ఎక్సలెంట్ వైఫ్ గా ఐశ్వర్యరాజేష్ నటిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాన్నాళ్ల కిందటే మొదలైంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజేష్ ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేశారు. ఈరోజు హీరో వెంకటేష్ సెట్స్ పైకి వచ్చారు. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్స్ విజువల్స్ తో ఓ వీడియో విడుదల చేశారు.

ఈ సినిమాలో వెంకటేష్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. కాస్త గడ్డం పెంచి, కళ్లజోడు తగిలించారు. ఈసారి ఎఫ్2 టైపులో ఫుల్ లెంగ్త్ హిలేరియస్ మూవీ కాకుండా, కాస్త డిఫరెంట్ స్టోరీ ఎంచుకున్నట్టు అనీల్ రావిపూడి ఇదివరకే చెప్పాడు. దానికి తగ్గట్టే ఉంది వెంకీ లుక్.

ఈ సినిమాకు ఇంకా అధికారికంగా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని మరోసారి ప్రకటించారు. చూస్తుంటే.. ఈసారి చిరు వెర్సెస్ వెంకీ బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదు.

4 Replies to “మాజీ పోలీస్ సెట్స్ పైకి వచ్చాడు”

  1. కేరళ మమ్ముట్టి వయస్సు 80 దగ్గర పడ్డ కూడా మంచి క్వాలిటీ సినిమాలు తీస్తున్నారు.

    కొత్త కొత్త రకాల కథలతో.

    కనీసం ఒక 5 సినిమాలు వస్తున్నాయి , ఒక్కో ఏడాది కి. అందులో గట్టిగ 3 సినిమాలు బాగా ఆడుతున్నాయి.

    మన తెలుగు పెద్ద ( ముసలి అనకూడదు కాబట్టి) హీరో లు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుని ఎక్కువ సినిమాలు చేస్తే, సినిమా రంగం కళ కళ లాడుతూ వంటిది..

Comments are closed.