యశోద..సర్రోగసీ థ్రిల్లర్

సమంత నటించిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ‘యశోద’. నవంబర్ 11న విడుదలవుతున్న ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. సర్రోగసీ నేపథ్యంలో జరిగే కుట్రలు. స్కాముల నేపథ్యంలో అల్లుకున్న కథ అన్న క్లారిటీ వచ్చింది ఇప్పుడు.…

సమంత నటించిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ‘యశోద’. నవంబర్ 11న విడుదలవుతున్న ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. సర్రోగసీ నేపథ్యంలో జరిగే కుట్రలు. స్కాముల నేపథ్యంలో అల్లుకున్న కథ అన్న క్లారిటీ వచ్చింది ఇప్పుడు. ఇంత వరకు ఓ థ్రిల్లర్ అని మాత్రమే తెలుసు కానీ లైన్ తెలియదు. ట్రయిలర్ ఇప్పుడు ఆ క్లారిటీ ఇచ్చింది.

ట్రయిలర్ కట్ పెర్ ఫెక్ట్ గా వుంది. కథను అలా అలా రివీల్ చేస్తూనే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను జోడంచారు. దర్శకులు హరి-హరిష్ టేకింగ్ బాగుంది. సినిమాకు చేసిన ఖర్చు, రిచ్ నెస్ తెలుస్తోంది. మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ పెర్ ఫెక్ట్ గా వుంది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ఇలా చాలా పెద్ద తారాగణమే వుంది సినిమాలో.

సమంత సినిమా వచ్చి చాలా కాలం అయింది. అలాగే భాగమతి, సినిమా తరువాత మంచి హీరోయిన్ సెంట్రిక్ థ్రిల్లర్లు వచ్చి కూడా చాలా కాలం అయింది. యశోద సినిమా ట్రయిలర్ చూస్తుంటే ఆ లోటు తీరేలాగే వుంది. ఈ సినిమాకు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.