చిత్రం: పట్టుదల
రేటింగ్: 2/5
తారాగణం: అజిత్ కుమార్, అర్జున్ సర్జా, త్రిష, రెజీనా, ఆరవ్ తదితరులు
కెమెరా: ఓం ప్రకాష్
ఎడిటింగ్: శ్రీకాంత్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: మగిళ్ తిరుమేని
విడుదల: 6 ఫిబ్రవరి 2025
తమిళంలోనూ, తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైన చిత్రమిది. తమిళ టైటిల్ “విడాముయర్చి”. దాని తెలుగు అర్ధం “పట్టుదల”. వేట్టయాన్ మాదిరిగా తమిళ టైటిల్ పెట్టేయకుండా, ఈ సారి తెలుగు అర్ధాన్ని టైటిల్ గా పెట్టినందుకు కాస్త సంతోషం. అజిత్ సినిమా అంటే ఎంతోకొంత హైప్ ఉంటుందని ఆశిస్తాం. తమిళంలో ఏమో కానీ తెలుగు వర్షన్ కి మాత్రం అసలు హడావిడే లేదు. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది ఫక్తు యాక్షన్ సినిమా అనిపిస్తుంది. ఇంతకీ విషయమేంటో చూద్దాం.
అర్జున్ (అజిత్), కాయల్ (త్రిష) భార్యాభర్తలు. అజర్‌బైజాన్‌లో వాళ్ల నివాసం. కానీ పెళ్లయ్యి కొన్నేళ్లయ్యేసరికి ఇద్దరికీ పొసగదు. పిల్లలు ఎలాగూ లేరు. కాయల్ విడిపోదామనుకుంటుంది. అర్జున్ కి విడిపోవడం ఇష్టంలేకపోయినా కాయల్ నిర్ణయాన్ని గౌరవిస్తాడు. విడిపోయే ముందు ఒక ఆఖరి రోడ్ ట్రిప్ కి రమ్మని కోరతాడు అర్జున్. కాయల్ సరేనని బయలుదేరుతుంది. ఆ ప్రయాణంలో వాళ్లకి ప్రమాదాలు ఎదురౌతాయి. విచిత్రమైన వ్యక్తులు పరిచయమవుతారు. కాయల్ కిడ్నాప్ కి గురౌతుంది. అర్జున్ ఆమెని వెతికే పనిలో పడతాడు. ఎవర్ని నమ్మాలో తెలీదు. ఎవరు మోసగాళ్లో తెలీదు. చివరికి ఏమయ్యిందనేది కథ.
సాధారణంగా మన సినిమాల్లో ఒక జానర్లో మరికొన్ని జానర్స్ మిక్స్ చేస్తారు. ఉదాహరణకి రొమాంటిక్ థ్రిల్లర్, హారర్ కామెడీ…ఇలా! కానీ ఇది పూర్తిస్థాయి థ్రిల్లర్. ఇందులో వేరే జానర్ లేదు. ప్రధమార్ధం మొదలైన అరగంట వరకు విసుగొస్తుంటుంది. ఈ సినిమాని చివరిదాకా భరించడం ఎలాగ అనిపిస్తుంటుంది. కానీ కథలో ఒక ట్విస్ట్. అక్కడి నుంచి ఇంటర్వల్ వరకు రెప్ప వేయనీయదు. అసలు ఏం జరుగుతోంది, ఏది మోసం, ఎవరి లక్ష్యం ఏమిటి అనేది అర్ధం కాక కాస్తంత ఉత్కంఠ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బలంగా ఉంది. ఈ “పట్టుదల”లో ఉన్న పట్టు అంతవరకే.
ద్వితీయార్ధానికి వచ్చే సరికి ఆశించిన పట్టు కనపడకుండా పోయింది. మరీ డార్క్ గా మారి, ప్రెడిక్టెబుల్ అవుతూ మళ్లీ చిరాకు తెప్పించడం మొదలుపెడుతుంది. కథ క్లైమాక్స్ కి చేరేకొద్దీ హింసాత్మకంగా మారి కొట్టుకుచావడాలే ఉన్నాయి.
ఇందులో హీరో అజిత్ ఆద్యంతం బాధితుడే. పూర్తి స్థాయి విక్టిమ్ అన్నమాట. హీరోయిజం కనబరిచే సన్నివేశాలు చివర్లో తప్ప ఎక్కడ లేవు- అది కూడా ఫైట్లల్లోనే. ప్రధమార్ధంలోని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో కాసేపు క్లీన్ షేవ్ లో కనిపించినా యంగ్ లుక్ రాలేదు. వృద్ధాప్యఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. తొలి అరగంటలోనే ఆ పాత్ర కాస్తంత నవ్వినా, ఏడ్చినా…ఆ తర్వాత మొత్తం సీరియస్ సింగిల్ ఎక్స్ప్రెషనే.
త్రిష చూడడానికి బాగుంది. నటనపరంగా ప్రధామార్ధంలోనే కొన్ని రసాలు పండించింది. ద్వితీయార్థంలో దాదాపు కనపడదు-అక్కడక్కడ తప్ప.
అర్జున్ సర్జా నెగటివ్ రోల్ లో సరిపోయాడు. రెజీనా కసాండ్రా కాస్తంత ఓవర్ యాక్షన్ చేసినా నెగటివ్ రోల్ కనుక పాసైపోయింది.
మిగిలిన నటీనటులు ఓకే.
టెక్నికల్ గా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం పర్వాలేదు. అద్భుతం మాత్రం కాదు. పాటలు రొట్టకొట్టుడు అరవ బీట్లే- ముఖ్యంగా మొదటి పాట. తర్వాత వినిపించే మాంటేజ్ సాంగ్ ఓకే.
ఓం ప్రకాష్ కెమెరా వర్క్ మాత్రం టాప్ క్లాస్ లో ఉంది. ముఖ్యంగా కారులోపల ఫైట్ సీన్స్ ని టాప్ యాంగిల్లో క్యాప్చర్ చేసిన విధానం బాగుంది. ఈ సీనియర్ కెమెరామన్ ని సరిగ్గా వాడుకోవాలి కానీ మంచి ఔట్పుట్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ చాలానే ఉంది.
ఈ సినిమా ఎ సెంటర్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు ఉంది. వాళ్లైనా చివరిదాకా చూడాలన్న పట్టుదల ఉంటే తప్ప చూడలేరు. ఇక బి,సి సెంటర్ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ కి అస్సలు నచ్చదు. ఎందుకంటే అసలిందులో హీరో అజిత్ వాళ్లు కోరుకున్నట్టు కనిపించడు. తమ హీరోని అంత సేపు విక్టిమ్ గా చూసే ఓపిక ఉండదు.
చివరిగా చెప్పాలంటే.. ఎక్కడా వేరే ఎలిమెంట్ ని ఆశించకుండా పూర్తి స్థాయి రోడ్ థ్రిల్లర్ సినిమాని చూడాలనుకునేవాళ్లు సినిమా మొదలైన అరగంట తర్వాత నుంచి ఇంటర్వల్ ముందు సీక్వెన్స్ వరకు మాత్రం భరించగలుగుతారు. ఆ తర్వాత పట్టు కోల్పోయింది ఈ “పట్టుదల”. తెలుగువాళ్లకి సింకవ్వని అజర్‌బైజాన్ యాంబియన్స్ లో తీసిన ఈ సినిమా ఏ హాలీవుడ్ సినిమానో తెలుగులో చూస్తున్న ఫీలింగొస్తుంది తప్ప అరవ డబ్బింగ్ సినిమాలా మాత్రం అనిపించదు. ఏది ఏమైనా రెండున్నరగంటల పాటు సినిమా హాల్లో కదలకుండా కూర్చోవాలన్న పట్టుదల ఉంటేనే చూడాలి ఈ తల నటించిన “పట్టుదల”. లేకపోతే పట్టుదల చూసినందుకు తల పట్టుకోవాలి.
బాటం లైన్: పట్టు “తల”
Hi
Play boy work :- yedu, tommidi, tommidi, yedu, eidhu, mudu, okati, sunna, sunna, nalugu
CB job :- nine, nine, eight, nine, zero, six, four, two, five, five
ఆరవ దర్శకులలో శంకర్ ,ఆరవ హీరోలలో అజిత్ లో దగ్గర సరుకు అయిపోయి దశాబ్దం దాటిపోయింది ,వీళ్ళు తీసే సినిమాలు ఆరవ అతి నా — యా – ల్లకి తప్ప మిగతా జనాలకి తలపోటు వికారం తెప్పిస్తున్నాయి
ఈ రివ్యూ చదివాక ఛలో సినిమాలో వెన్నెల కిషోర్ చెప్పిన పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటది కానీ మనకు కాదు అనే డైలాగ్ గుర్తుకు వచ్చింది


కర్ట్ రస్సెల్ సినిమా అనుకొంటే. ఎదో తీశారు అన్నట్టు వుంది. అయినా అజిత్ ని సరిగ్గా వాడుకోవటం కూడా తెలియాలి. అరవోళ్లకి ఆ కులం, మతం అనో, లేకపోతె మమ్మల్ని అణగదొక్కారు అని గోల తప్పితే మంచి డైరెక్టర్స్లు ఎవ్వరు లేరు ఇప్పుడు.
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
Seven, nine, nine, seven, five, three, one, zero, zero, four :- CB
Hello
Hi
Seven, nine, nine, seven, five, three, one, zero, zero, four :- CB
ఈ అరవ నా కొడుకులకి తెలుగు అంటే బాగా చులకన అయ్యిపోయి… వెట్టయాన్ అనే గత సినిమా తమిళ్.లో ఉన్న పేరు కూడా మార్చకుండా తెలుగు లో కూడా అదే పేరుతో వదిలారు…అయినా సరే వాళ్ళ సినిమాలే గొప్ప అని మళ్ళీ సోషల్ మీడియా లో ప్రగల్భాలు పలుకుతారు…మన వాళ్ళు కాస్త మన భాష నీ బతికించండి రా నాయనా…తెలుగు నేర్చు కోండి….నేర్పించండి…
వాళ్ళకి చులకన అవ్వడానికి మన తెలుగు వాళ్ళు తూ అంటే తుడుచుకుని పోయ తత్వం కూడా ఒక కారణం సోదరా వాళ్ళు మన సినిమాలు చూడకపోయినా ఇక్కడ మాత్రం సిగ్గు లేకుండా ఎగబడి చూస్తారు ఆరవ నా — యా – ల్ల సినిమాలని
ఆరవ కు – క్క – లకి మన సినిమా ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వడం ,ఆరవ సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎగేసుకుని చూడటం థియేటర్ లలో మానేయాలి వాళ్ళకి అవకాశాలు ఇచ్చే బదులు మన సినిమాలని ఆదరించే వేరే భాషల వాళ్ళకి ఇవ్వాలి
vaallu teesina cinemalu teeskochi telugu loki remake chese vedhavalanu mundhu chepputho kottaali. telugu heroes ki kuda telugu ante chulakana undhi. Example: Republic, Bro, game changer, paisa, hello brother, bus stop, HIT etc… ilaa telugu vaalle telugu ni nashanam chesthunnapudu arava vaallu cheyakunda ela untaaru?
mana telugu actors arava directors ni teeskoni movie chesthunnaru. mundu mana telugu vaallu sariga leru waste naa kodukulu
ప్లే బాయ్ వర్క్ >
తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc
తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc
Hi
Nine, three, eight, zero, five, three, seven, seven, four, seven nvc
Hi
తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది nud cal
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
రివ్యూ చదువుతుంటే ఈ సినిమా ఇరవయ్యేళ్ళ కింద విడుదలైనా అప్పుడే పాత చింతకాయ పచ్చడి అనేవాళ్ళేమో అనిపిస్తోంది