రెండు రహస్య సమావేశాలు.. పరిణామాలు ఏమిటో?

కాంగ్రెసు పార్టీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. వీటి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం.

కాంగ్రెసు పార్టీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. వీటి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం. ఈమధ్య రెండు కీలకమైన రహస్య సమావేశాలు జరిగాయి. దీనిపై అధిష్టానం ఆరా తీస్తోంది. పరిణామాలు ఎలా ఉంటాయోనని సీఎం రేవంత్ రెడ్డి కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ రహస్య సమావేశాల పట్ల బీఆర్ఎస్ హ్యాపీగా ఫీలవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఇంట్లో సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న పది మంది ఒరిజినల్ కాంగ్రెసు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమ్యారు.

ఫిరాయింపుదారులపై అనర్హత పిటిషన్లను సుప్రీం కోర్టు ఈ నెల 10 వ తేదీన విచారిస్తుంది. కోర్టు ఆదేశం మేరకు స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు కూడా ఇచ్చింది. ఆ నోటీసులకు నాలుగు వారాల్లోగా వివరణ ఇస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి కాబట్టి ఎలా ఇస్తే బాగుంటుందని చర్చించారు.

అసలు ఈ తలనొప్పి అంతా ఎందుకని, తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతే బాగుంటుందని అనుకుంటున్నారట. కాని వీరిని బీఆర్ఎస్ లోక చేర్చుకుంటారా అనేది సందేహమే. ఎందుకంటే వీరిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు తెప్పించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఉప ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెసు పార్టీకి బుద్ధి చెప్పాలని కలలు కంటోంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీలోని పరిస్థితులకు జీర్షించుకోలేకపోతున్నారట. కొందరు బహిరంగంగానే అసంతృప్తిని బయటపెడుతున్నారు. అంటివారిలో దానం నాగేందర్ ముందున్నాడు. ఇక ఒరిజినల్ కాంగ్రెసు నాయకులు పదిమంది ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, మంత్రులు తమను పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో గొడవలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డిపై వ్యతిరేకతతోనే ఈ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని కేటీఆర్ చెప్పారు. ఈ రహస్య భేటీపై పార్టీ అధిష్టానం ఆరా తీసింది. వెంటనే సీఎల్పీ మీటింగ్ పెట్టాలని ఆదేశించింది. మరి చివరకు ఈ రెండు రహస్య సమావేశాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పలేం.

4 Replies to “రెండు రహస్య సమావేశాలు.. పరిణామాలు ఏమిటో?”

Comments are closed.