మెగా Vs అల్లు.. ఒకే కాంపౌండ్ కాదా?

వరుసగా రెండోసారి రామ్ చరణ్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారంటూ అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మనిషి చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. ఆచితూచి మాట్లాడుతుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు అనే పేరుంది. ఇలాంటి మంచి ఇమేజ్ ఉన్న అల్లు అరవింద్, ఉన్నట్టుండి సడెన్ గా వరుసగా వివాదాస్పదమౌతున్నారు.

మొన్నటికిమొన్న గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ లేదా డిజాస్టర్ అనే అర్థం వచ్చేలా చేతులతో సైగలు చేసి మెగాభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేశారు.

రామ్ చరణ్ తో మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తీశారు అల్లు అరవింద్. తను తీసిన సినిమాను పొగిడే క్రమంలో, మగధీర కంటే ముందు చరణ్ నటించిన చిరుత సినిమా యావరేజ్ అని చెప్పి వివాదం రేపారు. ఫ్యాన్స్ ట్రోలింగ్ కు గురవుతున్నారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరుతతో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడని, ఆ సినిమా వెరీ యావరేజ్ గా ఆడిందని కామెంట్ చేశారు. దీంతో మేనల్లుడికి హిట్ ఇచ్చేందుకు తను మగధీర సినిమా తీశానని చెప్పుకున్నారు.

ఇలా వరుసగా రెండోసారి రామ్ చరణ్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారంటూ అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 2007లోనే పాతిక కోట్ల రూపాయల షేర్ సాధించి, ఆ ఏడాది రెండో హయ్యస్ట్ గ్రాసర్ గా చిరుత సినిమా నిలిచిందని, అల్లు అరవింద్ నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని లెక్కలు తీస్తున్నారు.

ఇదంతా పుష్ప-2 ఇచ్చిన ఉత్సాహమేనా..?

మొన్నటివరకు అల్లు అర్జున్ మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడని భావించారు మెగా ఫ్యాన్స్. కాంపౌండ్ నుంచి దూరంగా జరగడంతో పాటు పవన్ కల్యాణ్ పై పలు వ్యాఖ్యలు చేయడం, రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్పకపోవడం లాంటివి చాలానే చేశాడు. “తన మనసుకు నచ్చితేనే చేస్తా, మనకు నచ్చితే ఏదైనా చేస్తా” అంటూ ఆ తర్వాత ఆయన ప్రకటించుకోవడం వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు తండ్రి కూడా కొడుకు బాటలోనే నడుస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదంతా పుష్ప-2 ఇచ్చిన ఉత్సాహమేనా అనే చర్చ మొదలైంది.

మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతున్నదే. అయితే ఈ చర్చలోకి ఎప్పుడూ అల్లు అరవింద్ పేరును ఎవ్వరూ తీసుకురాలేదు. ఆయనెప్పుడూ చిరంజీవి మనిషి అనే కోణంలోనే చూసేవారు చాలామంది. తాజాగా ఆయన వ్యవహారశైలి చూసిన ఫ్యాన్స్.. తండ్రీకొడుకులిద్దరూ ఒక్కటే అని చర్చించుకుంటున్నారు.

5 Replies to “మెగా Vs అల్లు.. ఒకే కాంపౌండ్ కాదా?”

  1. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

Comments are closed.