రెండు మోసాలపై ఒకే రోజు క్లారిటీ

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లో అరెస్ట్ అయిన నీలేష్ చోప్రాకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వైజయంతీ మూవీస్ ప్రకటించింది.

ప్రజల్ని, సినిమా పరిశ్రమలోని వ్యక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్న రెండు రకాల మోసాలపై ఈరోజు ఒకేసారి క్లారిటీ వచ్చింది. వీటిలో ఒకటి సర్దార్-2 సినిమాకు చెందినది కాగా.. రెండోది వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థకు చెందిన మేటర్.

ముందుగా వైజయంతీ మూవీస్ సంస్థ విషయానికొస్తే.. తాజాగా హైదరాబాద్ పోలీసులు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడు ఆన్ లైన్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్నాడనేది ఆరోపణ. వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ గా ఇతడు పనిచేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. దీనిపై సదరు నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ లో అరెస్ట్ అయిన నీలేష్ చోప్రాకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ప్రస్తుతం లేదా గతంలో అతడు తమ సంస్థలో పని చేయలేదని స్పష్టం చేసింది.

ఇలాంటిదే మరో స్పష్టత ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నుంచి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యానర్ పై సర్దార్-2 సినిమా తెరకెక్కుతోంది. కార్తి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మంచి రోల్స్ ఉన్నాయని, అందులో ఛాన్స్ ఇప్పిస్తానంటూ కాస్త గుర్తింపు పొందిన నటీనటుల్నే ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు.

కొంతమంది నటీనటుల నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ, ఆ వ్యవహారాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాంటి వ్యక్తులపై లీగల్ గా చర్యలకు ఉపక్రమించినట్టు స్పష్టం చేసింది.

4 Replies to “రెండు మోసాలపై ఒకే రోజు క్లారిటీ”

  1. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

Comments are closed.