పాన్ ఇండియా హీరో అవుతాడా?

మరికొన్ని గంటల్లో తండేల్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్కెట్లోకి రాబోతోంది. చైతూ కోరిక నెరవేరుతుందా లేదా అనేది తేలిపోతుంది.

పైకి చెప్పకపోయినా నాగచైతన్య టార్గెట్ ఇదే. ఇప్పటికే తెలుగు నుంచి కొంతమంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో మెరిశారు. ఆ జాబితాలోకి చేరాలని చైతూకు కూడా బలంగా ఉంది.

ఇన్నాళ్లూ మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశాడు, తండేల్ తన కల నెరవేరుస్తుందని భావించాడు. అందుకే తనే చొరవ తీసుకొని, సినిమా చేస్తానని చెప్పి, బన్నీ వాస్ తో సహా అందర్నీ మోటివేట్ చేశాడు.

మరికొన్ని గంటల్లో తండేల్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్కెట్లోకి రాబోతోంది. చైతూ కోరిక నెరవేరుతుందా లేదా అనేది తేలిపోతుంది.

కొన్ని మనం అనుకుంటే జరగవు, అలా జరిగిపోతుంటాయి. పాన్ ఇండియా లెవెల్లో హిట్టయిన కాంతార, కార్తికేయ-2 సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ సినిమాలు నార్త్ బెల్ట్ లో కూడా హిట్టవుతాయని ఆ మేకర్స్ ఊహించలేదు. తండేల్ కూడా అలాంటి సర్ ప్రైజ్ విజయాన్ని తనకు అందిస్తుందని బలంగా నమ్ముతున్నాడు చైతూ.

అందుకే కార్తికేయ-2 సక్సెస్ అయిన వెంటనే ‘గీతా’తో పాటు చైతూ కూడా చందు మొండేటిని లాక్ చేశాడు. సాయిపల్లవి లాంటి హీరోయిన్ ను, దేవిశ్రీ లాంటి మ్యూజిక్ డైరక్టర్ ను తీసుకున్నారు. వీళ్లు మాత్రమే కాకుండా, టోటల్ టెక్నికల్ టీమ్ అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంది.

దీనికి అల్లు అరవింద్ ఆర్థిక తోడ్పాటు కూడా కలిసొచ్చింది. ఫలితంగా మంచి క్వాలిటీ ప్రొడెక్ట్ సిద్ధమైంది. ఇక మిగిలింది పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిజల్ట్ ఏంటనేది తేలడమే. అదృష్టం కలిసొచ్చి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్టయితే, నాగచైతన్య కల నెరవేరినట్టవుతుంది.

5 Replies to “పాన్ ఇండియా హీరో అవుతాడా?”

Comments are closed.