పూరి దర్శకత్వంలో రానున్న ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో ఛార్మి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. ఈ సినిమా కోసం ఛార్మి న్యూ లుక్‌తో కన్పించనుంది. కంప్లీట్ మేకోవర్ అనలేంగానీ, ఛార్మి కాస్త కొత్తగా కనిపిస్తోందిప్పుడు. వర్మ తాజా చిత్రం ‘365 డేస్’ ఆడియో రిలీజ్ వేడుకలో ఛార్మి ఈ కొత్త లుక్‌తోనే హల్‌చల్ చేసింది.
అసలే భారీ గ్లామర్ కావడంతో, ఛార్మి ఆ బొద్దుతనంలోనే గ్లామర్ సందడి చేయడంతో, సినిమాలో మెయిన్ కాస్టింగ్ అయిన హీరోయిన్లు తేలిపోయారు. తన స్కిన్ టోన్‌కి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ అయిన బ్లాక్ డ్రస్‌లో మెరిసిపోయింది ఛార్మి. ఇప్పుడంతా ఈ నయా ‘జ్యోతిలక్ష్మి’ గురించే చర్చించుకుంటున్నారు.
కెమెరాల కళ్ళు కూడా ఛార్మి వైపే పరుగులు తీశాయి. టక టకా తన మీద ఫొటో ఫ్లాష్‌లు పడ్తోంటే ఛార్మి మురిసిపోవడం గమనార్హం. అంతా పూరి ఎఫెక్ట్. ఆ మధ్య బాగా పడిపోయిన ఛార్మి ఇమేజ్, ‘జ్యోతిలక్ష్మి’ పుణ్యమా అని తిరిగి ఫామ్‌లోకి వచ్చేలా వుంది. ఈ హాట్ హాట్ జ్యోతిలక్ష్మి తెరపై చేయబోయే సందడి ఎలా వుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్నట్టు, ఈ సినిమాకి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న విషయం విదితమే.