అదిరిపోయే ఆఫర్: ఎకరం భూమి 99 పైసలే

కానీ ఏ వారసత్వ లింకూ లేకుండా అప్పళంగా ఎకారాలకెకరాల భూమిని సొంతం చేసుకునే అవకాశం కొందరికే ఉంటుంది.

సామాన్యుడికి సెంటు భూమి కొనాలంటే నానాకష్టాలు పడాలి. మధ్యతరగతి, ఆ పై తరగతి..ఇలా ఏ తరగతి వ్యక్తైనా భూమి కొనాలంటే కష్టపడి సంపాదించి దాచుకున్నది బయటకి తీసి పెట్టాలి. లేదా అదృష్టవంతులకైతే తాతలు తండ్రుల ఆస్తులు వారసత్వంగా సంక్రమిస్తే ఎంజాయ్ చేయొచ్చు.

కానీ ఏ వారసత్వ లింకూ లేకుండా అప్పళంగా ఎకారాలకెకరాల భూమిని సొంతం చేసుకునే అవకాశం కొందరికే ఉంటుంది. వాళ్లేమీ సామాన్యులు కాదు, అపర కుబేరులు. అప్పళంగా తీసుకునే భూమి ప్రభుత్వానిది, అంటే ప్రజలది.

కథలోకి వెళితే…తాజాగా టీసీయస్ (అంటే టాటా వారి కంపెనీ) కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21.6 ఎకరాల భూమిని ఎకరం 99 పైసల చొప్పున ధారాదత్తం చేసింది. అది కూడా విశాఖపట్నంలో. అసలు ఎకరం 99 పైసలంటే..టైం మెషీన్ ఎక్కి నూట యాభై ఏళ్ల వెనక్కి వెళ్లినా అంతకంటే ఎక్కువే పలుకుతుంది. ఏమన్నా అంటే గుజరాత్ లో అలాగే ఇచ్చారు..అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటాడు బాబుగారు.

ప్రభుత్వాలు ఇస్తున్నాయి సరే. తీసుకునే కంపెనీలకి సిగ్గుండక్కర్లా? లక్షల కోట్ల ఆస్తులున్న టాటా వారు అప్పళంగా ప్రజాసంపదని తీసుకోవడమేంటి? టాటాలని దేశభక్తులని ఏ లెక్కలో అనాలి? ప్రభుత్వానికి తగిన మార్కెట్ విలువ (లేదా కనీసం గవర్నమెంటు రేటు) చెల్లించి తీసుకోవచ్చు కదా.

అబ్బే..ఊరికే వస్తుంటే ఉరుక్కుంటూ వెళ్లి తీసుకుంటారు. మిగిలిన కంపెనీల వాళ్లు తమకీ కావాలంటున్నారు. ఇస్తే వాళ్లూ ఉరుక్కుంటూ వెళ్తారు, ఇవ్వకపోతే ఉడుక్కుంటారు.

ఇలాంటి పద్ధతిలోనే ఎస్.ఆర్.ఎం కాలేజీకి 100 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. ఒక్క సీటన్నా ఆ కాలేజీ ఫ్రీగా ఇస్తుందా? ఎంతమంది ప్రజ్ఞావంతులైన పేద విద్యార్థులకి ఉచిత విద్య లభించే అవకాశముంది? ఏమీ ఉండదు. క్యాషులో ఫీజులు వసూలు చేసి బస్తాలు నింపుకోవడమే. ఆ బస్తాల్లో అగ్రభాగం ఎన్నికల్లో ఖర్చు చేయడమే. అందుకే కాలేజీ భూములిచ్చేది, పుచ్చుకునేది!

అయినా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి 21 ఎకరాలు దేనికి? కాలేజీకి 100 ఎకరాలు ఎందుకు?

మూడు నాలుగు ఎకరాల్లో సాఫ్ట్ వేర్ కంపీనీలు వెర్టికల్ గా కట్టుకోవచ్చుగా. అమెరికాలో ఫ్రీడం టవరు, చైనాలో ట్రేడ్ సెంటర్లు..ఇలా అన్నీ ఆకాశహర్మ్యాలే కదా. బాబుగారు కూడా హైటెక్ సీయం గా బ్రాండింగ్ తెచ్చుకున్నది మాదాపూర్లో హైటెక్ సిటీ బిల్డింగుని చూపించే కదా! మరి ఇప్పుడు పదుల, వందల ఎకరాలు పంచేయడం దేనికి? సిగ్గులేకుండా సదరు కంపెనీలు పుచ్చుకోవడమేంటి? అడిగే ప్రజలు లేకపొవడమేంటి?

అసలింతకీ ల్యాండ్ కోసం కంపెనీలు పెట్టారా? లేద కంపెనీ కోసం ల్యాండా?

అనంతపురంలో కియా కంపెనీకి ఎన్నో ఎకరాలు ఇచ్చాడు బాబుగారు. అక్కడ వెలసిన ఫ్యాక్టరీ ద్వారా ఎంతమంది స్థానికులకి ఉద్యోగాలొచ్చాయి? కంపెనీ చెప్పే సంఖ్యకి, ధారాదత్తం చేసిన సంపదకి పొంతన ఉంటుందా? చచ్చినా ఉండదు. అందుకే ఆ లెక్కలు చెప్పరు. పోనీ ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి వచ్చే పన్నెంత? పన్ను రాయితీ బాపతులో కేటాయించిన స్థలమది. ఎందుకురా అంటే, కనీసంలో కనీసం ఆ చుట్టు పక్కల రియల్ ఎస్టేట్ బూం వస్తే వెర్రి జనాలు కొంటే, ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు సంపాదించుకోవచ్చని! ఎవడికో ఎకారాలు ఫ్రీ గా ఇవ్వడమేంటి? ప్రజలని గొర్రెల్ని చేసి రియల్ బూములో వాళ్లని రంగరించి వాళ్ల డబ్బు గుంజడమేంటి? ఇంతకీ కియా చుట్టూ భూములు కొన్నవాళ్ల పరిస్థితి ఏంటి?

తాజాగా కేటాయించిన టీసీయస్ ల్యాండులో 12000 జాబులొస్తాయట. 12000 ఉద్యోగాలూ ఆంధ్రా వాళ్లకేనా? బయటి రాష్ట్రాల నుంచి రారా?

అసలీ కంపెనీలు లక్షల కోట్లకి పడగలెత్తేది ఇలా అప్పళంగా వచ్చిన భూముల మీదనే. వ్యాపారం పిసరంతైతే, భూముల విలువ కొండంత. ఆ భూముల్ని చూపించి బ్యాంక్ లోన్లు తీసుకోవచ్చు. ఏదో వ్యాపారం చేసాం అనిపించి, తర్వాత కట్టకుండా కూర్చుంటే బ్యాంక్ మహా అయితే భూమిని వేలం వేసుకుంటుంది. పోయిందేముంది..ఊరికే వచ్చిందే కదా! ఒక వేళ కంపెనీలు పూర్తిగా మునిగినా ల్యాండుల్ని అమ్ముకుని బెయిల్ ఔట్ అయ్యే ప్రణాళికలు కూడా ఉంటాయి.

కంపెనీలకి ఉచిత భూమి, రాజకీయ నాయకులకి రియల్ దందా, జనానికి మిగిలేది “వాళ్ల బొంద”. అదీ కథ.

హరగోపాల్ సూరపనేని

42 Replies to “అదిరిపోయే ఆఫర్: ఎకరం భూమి 99 పైసలే”

  1. ఒక పంచె కట్టిన నింజాకొ డుకు వాడి కొడుకు సూట్ కేస్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ కి చెందిన వాన్ పిక్ కి 50000+ ఎకరాలు, ఒక డెకాయిట్ ధనార్జన రెడ్డి కి బ్రాహ్మణి స్టీల్స్ వంక పెట్టి 4000+ ఎకరాలు ఇంకా చాలా ప్రజల ఆస్తులు దోచి పెట్టాడు .. ఒక్క జాబ్ కూడా రాలేదు మరి. వాటి లెక్కలు కూడా మాట్లాడు గోపాలం..

  2. ఒక పంచె కట్టిన మహా మేత తన కుమారుడి సూట్ కేస్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ కి చెందిన వాన్ పిక్ కి 50000+ ఎకరాలు, ఒక డెకాయిట్ ధనార్జన రెడ్డి కి బ్రాహ్మణి స్టీల్స్ వంక పెట్టి 4000+ ఎకరాలు ఇంకా చాలా ప్రజల ఆస్తులు దోచి పెట్టాడు .. ఒక్క జాబ్ కూడా రాలేదు మరి. వాటి లెక్కలు కూడా మాట్లాడు గోపాలం..

  3. ఇలాగే తలంచి మాదాపూర్ లో ప్రభుత్వ మూములన్ని అలాగే ఉంచుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది గోపాలరావు గారు? దేశంలో వేరే పెద్ద నగరాలు అంటే నీ దగ్గరకు ఎందుకు రావాలి? టాటా అయినా ఇన్ఫోసిస్ అయినా ఇంకో కంపెనీ అయినా ఏదో ఆశించే వస్తాయి. డైరెక్ట్ గా 100 మందికి ఉద్యోగాలు వస్తే ఇండైరెక్ట్గా వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఇవన్నీ మీకు అర్దం కావని కాదు, కానీ ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు, అది ఎప్పటికీ జరగదు.

  4. Hey Gopalam, election ayyaka vacchesadu!!!!

    ok ok ok gopalam, nee point ke vaddam,

    nuvvu America lo koorchunnavu, nuvvu india ko tatte tax yentha?

    ne valla india lo samanyalu laki kalige benifit yemiti?

    siggu vundakkarla?

  5. మరి పని ఏమి చేయకుండ డెం*గి తిని ము*ప్పుటల ఏరి*గే ప్యా*లెస్ పుల*కేశి గాడి*కి వందల ఎకరాల్లో ఊ*రికి ఒక ప్యా*లెస్ ఎం*దుకురా గ్రేట్ ఆంద్ర?

    ఒక టాయిలెట్ లాంటి సింగిల్ బెడ్రూం ఇంటిలో వుండొచ్చు కదా అని అడిగావా నీకు బిచ్చం విసిరేసే ప్యాలెస్ పులకేశి గాడిని.?

  6. పొని TCS కి కాకుండా మన మెత గాడిలా…

    భ్రమ్మనీ స్తీల్స్ పెరుతొ గాలి జనర్దన్ రెడ్డికి 14 వెల ఎకరాలు

    ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి లెపాక్షి నాలజ్ హబ్బు పెరుతొ 9 వెల ఎకరాలు

    మట్రిక్ష్ ప్రసాద్ కి పెరుతొ 11 వెల ఎకరాలు…

    ఇస్తె సరిపొతుందా? ఇంతకీ వాళ్ళు ఎమి పీకారు? అన్న కంపనీలలొ పెట్టుబడులు పెట్టారు అంతె!

    1. సరిగా గడ్డి పెట్టావు సోదరా వేల ఎకరాలు దోచిపెడితే అది కనపడదు ఉద్యోగాలు కల్పించిన దాని గురించి 21 ఎకరాలు ఇ‌స్తే తప్పయింది ఈడికి

  7. విశాక సాములొరికి విశాకలొ 12 ఎకరాలు దారాదత్తం చెస్తె నీ నొరు ఎందుకు లెగవలెదు!

    .

    అలానె మన జగన్ Y.-.C.-.P పార్టి ఆఫీసుల కొసం 42 ఎకరాలు ఇచ్చుకుంటె నువ్వు మొరగనె లెదు!

    1. అలానె Dasapalla, Hayagriva, NCC, Rama Naidu Studios, Karthikavanam Project, Bay Park Wellness Centre Project భూములు ఎటు వెల్లాయి మన అన్న పాలనలొ!!

  8. TCS కి 99 పైసలకి లీజుగా మాత్రమె ఇచ్చారు? ఆ బూములు TCS కి అమ్మలెదు! కాస్త తెలుసుకొని రాయరా GA?

    1. అలానె Dasapalla, Hayagriva, NCC, Rama Naidu Studios, Karthikavanam Project, Bay Park Wellness Centre Project భూములు ఎటు వెల్లాయి మన jagan అన్న పాలనలొ!!

  9. ఒక ప్రశ్న.

    ఇదే భూమి మీరు ఎదురు ఇస్తామన్నా ఈ స్థాయి కంపెనీ లు చర్చలకి వస్తాయా?

  10. సాములోరికి ఇవ్వాలి, సీ వ్యూ పాలస్ లు కట్టాలి. ఏమైనా పనికిరాని భూములు ఉంటే పంచేయాలి. పైసా ఉపయోగం లేని వాటికి ఇవ్వాలి. అంతే గానీ ఇలా పరిశ్రమలకు ఇస్తారా. రాష్ట్రం కళ కళ లాడితే మా మాట ఎవడు వింటాడు. మా ఉచితాలు ఎవరికి పంచాలి

  11. కొంచెం తెలుసుకొని రాయండి సార్.. మిడి మిడి జ్ఞానం తో రాయొద్దు.. tcs కి చిన్న చిన్న బిల్డింగ్స్ లో రెంట్ కి ఉన్న దాఖలాలు లేవు, వారు own క్యాంపస్ లో మాత్రమే బిజినెస్ రన్ చేస్తుంటారు.. క్యాంపస్ కావాలంటే రూల్స్ ప్రకారం అప్రూవల్స్ రావాలంటే కనీసం ఆమాత్రం భూమి కావాలి.. అంత భూమిని ప్రభుత్వ రేటు ప్రకారం అమ్మినా, లీజు కిచ్చినా tcs ఎందుకు ముందుకు వస్తుంది.. ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలంటే initial గా ఇలాంటి ఆఫర్స్ ఇవ్వాలి.. మీకు తెలియకపోతే తెలుసుకోండి, అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆర్టికల్స్ రాయొద్దు.

  12. విశాక సాములొరికి విలువైన 12 ఎకరాలు ఇస్తె తప్పు లెదు….

    అలానె సొంత Y.-.C.-.P పార్టి ఆఫీసులు కట్టుకొటనికి 42 ఎకరాలు ఇస్తె తప్పు లెదు కాని…

    TCS కి లీజుకి ఇస్తె తప్పా?

  13. విశాక సాములొరికి విశాక లొ విలువైన 12 ఎకరాలు ఇస్తె తప్పు లెదు….

    అలానె సొంత Y.-.C.-.P పార్టి ఆఫీసులు కట్టుకొటనికి 42 ఎకరాలు ఇస్తె తప్పు లెదు కాని…

    TCS కి లీజుకి ఇస్తె మాత్రం తప్పా?

  14. Srmt కాలేజీ కాదు యూనివర్సిటీ అని చెప్పండి రా నాయన వాళ్ళ వలన అక్కడ స్టూడెంట్స్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ఏంటో మంది లాభపడుతున్నారు హాస్టల్స్, రూమ్స్ కిరాణా స్టోర్స్ ఇలా కొంచెం బుర్ర వాడు బుర్ర తక్కువ జర్నలిస్ట్

  15. ఒక్క ప్యాలెస్ పులకేశి గాడికి ప్రతి ఊర్లో అన్ని యేకరల్లో ప్యాలెస్ లు ఎందుకు ?

    ఈ లెక్కన ఆ ప్యాలస్ లు అన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ఆసుపత్రి, దళిత హాస్టల్ లుగా మార్చాలి.

    ప్యాలెస్ పులకేశి , గ్రేట్ ఆంద్ర చెప్పినట్లు ఒక సింగిల్ బెడ్రూం లో వుండాలి.

  16. సూరపనేని అనేది కమ్మ కులం తోక. కమ్మ కులం తోక, రెడ్డి కులం తోక, బ్రాహ్మణ కులం తోక లు మాత్రం వదులుకోరు కదా , వెంకట్ రెడ్డి గారు. తెర వెనుక ఈ.ముఠా అందరూ వాటికన్ గొర్రె బిడ్డ లు. కానీ పెద్ద కుల తోకలు కావాలి.

  17. విశాక సాములొరికి విశాక లొ విలువైన 12 ఎకరాలు ఇస్తె తప్పు లెదు….

    అలానె సొంత Y.-.C.-.P పా.-.ర్టి ఆఫీసులు కట్టుకొటనికి 42 ఎకరాలు ఇస్తె తప్పు లెదు కాని…

    TCS కి లీజుకి ఇస్తె తప్పా?

  18. ఇట్లా ఊరికే ఇవ్వకూడదు.మార్కెట్ రేట్ కు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత డెవలప్ అయిన తర్వాత ల్యాండ్ అమ్ముకుంటారు. దాంతోటే వాళ్లు బాగా సంపాదిస్తారు. కరెక్ట్ కాదు .మరియు ల్యాండ్ చాలా కాస్ట్లీ కాబట్టి రిక్వైర్మెంట్కే వరకే ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ఇస్తే తర్వాత ల్యాండ్ ఉండదు. ల్యాండ్ తీసుకున్న వాళ్లకు బంపర్ అడ్వాంటేజ్ కాబట్టి జాగ్రత్తగా చూసి ఇవ్వాలి…

Comments are closed.